ఈరోజు ఉదయం నుండి నెల్లూరు జిల్లా వెంకటాచలం లో ఎంపీడీవో పై జరిగిన దౌర్జన్యం విషయంలో నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా అధికార పార్టీలో ఉండే చిన్న నేతలపై కూడా కేసు నమోదు అయ్యే సంఘటనలు చాలా తక్కువ. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని ఆగడాలు చేసినా అన్ని భరించాల్సిందే అన్నట్లు ఉండేది పరిస్థితి. ఇలాంటి సీన్లు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలు చాలా చూశారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు కీలకమైన పదవుల్లో ఉన్న వారిపై దాడులు చేసినా... ప్రభుత్వ అధికారులు పై దౌర్జన్యం చేసిన అడ్డు చెప్పేవారు కాదు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినా... తను మంత్రి పదవి కట్టబెట్టిన వారు అయినే తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఎంపీడీవో విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కేవలం అతని అనుచరులు మాత్రమే దౌర్జన్యం చేశారని ఎంపీడీవో కూడా ఫిర్యాదు చేసింది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన కూడా ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై జగన్ కూడా ఏమి చెప్పకపోవడంతో ఇకపై ఏ నేత అయినా నా హద్దు మీరితే చర్యలు తప్పవని తేల్చి చెప్పినట్లు అయింది. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడిగా మంచి పేరుగాంచినా కూడా అతనిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. తను ఈ విషయంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా అతని అనుచరులు చేసిన హంగామాకి ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు పెట్టేశారు. ఇలా హద్దులు దాటిన వారి విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం మొహమాట పడకుండా చర్యలు తీసుకోవడం... అరెస్టు చేయించడం అనేది స్వాగతించాల్సిన విషయమే..!


మరింత సమాచారం తెలుసుకోండి: