దేశంలో ఎన్నికలహవా నడుస్తోంది.అభ్యర్ధులు నామినేషన్లు వేసేందుకు మందీ మార్బలంతో హాడవిడి చేస్తుంటారు.ఈ సమ యంలో ఒక్కొక్కరు వివిధ పద్దతుల్లో నామినేషన్లు వేస్తుంటారు.కొందరు గుర్రాల మీద,మరికొందరు సైకిళ్ల మీద,నామినేషన్స్ వేస్తే,ఇంకొందరు అవసరం ఉన్నప్పుడు అసలే దొరకని చిల్లరనంతా తీసుకొచ్చి అధికారుల ముందు పెట్టి వారి సహనాన్ని పరీక్షి స్తుంటారు.ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిధులు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమీషన్ అధికారులకు ఇలాంటి పరీక్షే ఎదురైంది.అదేమంటే.


ఇండోర్-3 అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు బరిలో దిగుతున్న ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చాడు.అందరి లా నామినేషన్ దాఖలుచేస్తే గుర్తింపు ఎలావస్తుంది,ఎలక్షన్లో ఓడిన,గెలిచిన ఆ అధికారులకు తానుమాత్రం ఎప్పుడు గుర్తుండా లని అనుకున్నాడో ఏమో గాని,నామినేషన్ ఫీజుకోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చిల్లర రూపంలో పట్టుకొచ్చాడు.అదీ పది,పరకో కాదు..ఐదు రూపాయల బిళ్లలలు కూడా కాదు,ఏకంగా,అన్నీ ఒక్క రూపాయి బిళ్లలే.


ఆ బిళ్లలను చూసిన అధికారులు షాక్ అయ్యారు.ఐదుగురు అధికారులు కలిసి కష్టపడి లెక్కించడం మొదలెడితే,పది వేల చిల్లర తేలడానికి గంటన్నర పట్టిందట..ఇది ఎవరు చేసారంటే సెంట్రల్‌ మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి పోటీ చేస్తున్న సంతోష్‌ సబ్డే (28) చేసాడు.పట్టణంలో ఉన్న సమస్యను ఎత్తిచూపేందుకు,ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.నగరంలో పలుదుకాణాల్లో రూ.10 నాణేలను స్వీకరించడం లేదని,దీన్ని అధికారులుదృష్టికి తీసుకెళ్లేందుకే ఈమార్గం ఎంచుకున్నట్లు  తెలిపారు.


మొదట ఎన్నికల అధికారులు కూడా రూ. 10 నాణేలను వద్దన్నారని, విషయం మీడియాకు తెలియడంతో రూ. 1000 వరకూ రూ. 10 నాణేలు తీసుకుంటామని, మిగిలింది నోట్ల రూపంలో ఇవ్వాలని కోరారని తెలిపారు.అయితే తాను ససేమీరా అనడంతో చివరకు మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో స్వీకరించారని తెలిపారు.దీపక్ పవార్ ను ఇలా ఎందుకు చేసారని ప్రశ్నించగా జనాల దగ్గర నుంచి సేకరించిన డబ్బును డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతోనే,చిల్లర పట్టుకొచ్చినట్టు సమాధానమిచ్చాడు.ఇక కొసమెరుపు ఏంటంటే చిల్లర లెక్కించేసరికే నామినేషన్ సమయం ముగిసిపోవడంతో పవార్‌కు అధికారులు రసీదు ఇచ్చిన రేపు రమ్మని పంపించడం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: