జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య షాక్ ల మీద షాక్ లు తగులుతున్నా యి. ఒకరి తర్వాత ఒకరు పార్టీలోని కీలక నేతలు వరుసపెట్టి పార్టీని వీడిపోతున్నారు. మొన్ననే మాజీ ఎమ్మెల్యే మరియు సీనియర్ నేత అయిన ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసి రెండు రోజులు కాకముందే మరొక నేత పార్టీని వీడారు. అతనే గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య. గాజువాక ప్రజలు మరియు కార్యకర్తల కోరిక మేరకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లు పవన్ కు ఒక లేఖ రాశారు. 

ఇంకా ఆ లేఖలో ఆయనకు వ్యక్తిగతంగా పవన్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నా కూడా రాజకీయంగా మాత్రం జనసేనతో కలిసి నడవలేని స్పష్టం చేశాడు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కు త్యాగం చేసిన వెంకటరామయ్య పెందుర్తి నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఇక తన శేష రాజకీయ జీవితం జనసేన పార్టీతో కలిసి సాగితే తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుందన్న ఆలోచనతోనే చింతలపూడి వెంకటరామయ్య పార్టీ వీడినట్లు తెలుస్తోంది. ఇకపోతే చింతలపూడి పార్టీ నుంచి వెళ్లిపోవడం జనసేనకు పెద్ద లోటు అని చెప్పవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వరుసపెట్టి నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా కూడా పవన్ కల్యాణ్ అందుకు తగిన విధంగా ఏ రకమైన కసరత్తులు చేపట్టడమే లేదు. రావెల కిషోర్ బాబు తో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. చింతలపూడి కాకుండా ఇప్పటికే చింతల పార్ధసారధి, మారిశెట్టి రాఘవయ్య ,అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు మరియు ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. ఇకనైనా పవన్ తమ పార్టీ నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వకపోతే అసలు పార్టీ మూసుకోవలసిన పరిస్థితి రాక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: