లోక్‌సభ ఎన్నికల తరువాత కీల‌క‌మైన మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహ‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సార్వ‌త్రిక పోరు త‌ర్వాత జ‌రుగుతున్న‌ తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార బీజేపీకి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్‌కు కీల‌క‌మైన‌వే. లోక్‌సభ ఎన్నికల్లో  ప్రదర్శించిన దూకుడును మళ్లీ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో చూపించాలని బీజేపీ ఉత్సాహపడుతోంది. బీజేపీకి బ్రేక్ వేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. 


జాతీయ రాజ‌కీయాల‌ను విశ్లేషించే వారి అభిప్రాయం ప్ర‌కారం, లోక్‌స‌భ‌ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మధ్య ఈ ఆరు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఇవే విజేతలను నిర్ణయిస్తాయని అంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు- ట్రిపుల్ తలాక్ రద్దు-బ్యాంకుల విలీనం-కాంగ్రెస్ చీఫ్ గా తప్పుకున్న రాహుల్-దేశం గుమ్మంలో ఆర్థిక మాంద్యం-దేశం గుమ్మంలో ఆర్థిక మాంద్యం-ప్యాకేజీల వెల్లువ కీల‌క పాత్ర పోషించ‌నున్నాయి. 

ఇదిలాఉండ‌గా, మొదటిసారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పోటీకి సిద్ధమైంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన పలువురు రైతులు టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి  సీఎం కేసీఆర్‌ను అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరారు.నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలైన డెగ్లూర్, నయ్ గావ్, బోకర్,  హిమాయత్ నగర్, కిన్వట్ కు చెందిన పలువురు రైతులు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయన్నారు రైతులు. తమ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్‌ను అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో నాందేడ్‌ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించారు. ఇప్పుడు అదే నినాదంతో అక్కడ నుండి TRS టికెట్ పై పోటీచేసేందుకు కొందరు  రైతులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం సీట్లు: 288
ఓటర్లు: 8కోట్ల 73లక్షల 30వేల 484
ప్రధాన పార్టీలు: బీజేపీ–శివసేన కూటమి, కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి
ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–124, శివసేన–61, కాంగ్రెస్–36, ఎన్సీపీ–32

హర్యానా అసెంబ్లీ
మొత్తం సీట్లు: 90
ఓటర్లు: 1కోటి 60 లక్షల 97వేల 230
ప్రధాన పార్టీలు: బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ
ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–47,కాంగ్రెస్–16, ఐఎన్ఎల్డీ–7

మరింత సమాచారం తెలుసుకోండి: