ఒక విషయం తేలిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ రైతు భరోసా కార్యక్రమాన్ని రంభించడానికి రావడంలేదు. ఈ నెల మొదటివారంలో జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానించారు.  ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కూడా అర్ధించారు. అప్పట్లో దీని మీద రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. మోడీ వస్తారని వైసీపీ అంటే, రారు రాకూడదు అని టీడీపీగా గట్టిగా కోరుకుంది.


చివరికి టీడీపీ వారి వాదనే గెలిచినట్లుంది. మోడీ రావడంలేదు. ఈ విషయాన్ని పీఎంఓ ఆఫీస్ నాడు ప్రకటించకున్నా ఇపుడు బయటకు వచ్చింది. ముందే ఉన్న అనేక బిజీ కార్యక్రమాల వల్ల తాను రాలేకపోతున్నట్లుగా మోడీ జగన్ కి ఆనాడే  చెప్పారట. అందువల్ల రైతు భరోసా అన్నది ఇపుడు జగనే ఇస్తున్నారు. ఆ కార్యక్రమం ఆయనే ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం నెల్లూరు జిల్లాలోని కాకుటూర్లో జగన్ ఈ నెల 15న జరిగే ఒక కార్యక్రమంలో రైతులకు చెక్కులు ఇస్తారు. కౌలు రైతులకు సర్టిఫికేట్లు ఇస్తారు. ఆ రోజు జరిగే బహిరంగ సభలో జగన్ మాట్లాడుతారు. ఇక రైతు భరోసా కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం 5,510 కోట్లను నిన్ననే విడుదల చేసింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా ఈ మొత్తం పడుతుంది.


మొత్తం మీద రైతుల విషయంలో తనకు ఉన్న కమిట్మెంట్మ్,  పట్టుదలను జగన్ ఈ విధంగా నిరూపించుకుంటున్నారు. టీడీపీ కుళ్ళుకునేలా ఒకే నెలలో వరసగా అనేక పధకాలు ప్రారంభించి  జగన్ హీరో అయిపోతున్నారు. ఇక బీజేపీ వారు సైతం చెప్పుకునేదుకు ఏమీ లేకుండా పోయింది. ప్రధాని రాకపోవడం వెనక ఏ రాజకీయం నడిచిందో తెలియదు కానీ ఏపీలో బీజేపీ ఇదీ మా  పధకం అని అనడానికి లేకుండా పోయిందిపుడు. అంతే మరి చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: