శ్రీరెడ్డి అంటేనే వివాదాలకు కేంద్రబిందువు. ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వార్తల్లో నిలుస్తుంది. మొన్నటికి మొన్న వైసీపిలోని ఓ యూత్ నాయకుండంటే చాల ఇష్టం. ఒక్కరోజైన అతని భార్యగా ఉంటేచాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఫోకస్ పెట్టి ఇటీవలే ఫేస్‌బుక్ ద్వారా జగన్‌కు కొన్ని సలహాలు కూడా ఇచ్చిన ఆమె, తాజాగా ఏపీ సీఎంకు మద్దతుగా సోషల్ మీడియాలో మరిన్ని పోస్టులు పెట్టింది.


అవేమంటే జగన్‌కు సిన్సియర్‌గా పని చేస్తున్నారని, ఆయన పనికి ఎవరైనా అడ్డొస్తే మర్డర్ చేసి జైలుకు పోవడానికైన సిద్దమే కాబట్టి కాం గా ఆయన పని ఆయన్ను చేయనీయండంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇదేగాకుండా జగన్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే  తాను కోపం పట్టలేకపోతున్నానంటూ ఊగిపోతూ, తెగ కామెంట్ చేశారు. ఇక్కడితో చాలన్నట్లుగా మీడియా వైపు గాలి మళ్లిన ఈమె మీడియాను ప్రభుత్వం నియంత్రించడం తప్పు. కాని, మీడియా కూడా తమకు ఇష్టమైన పార్టీ గురించి ఓహో, ఆహో అని రాస్తూ.. వేరే పార్టీ వాళ్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. క్రిమినల్స్ అని రాయడం, చిన్నచూపు చూడటం తప్పని శ్రీరెడ్డి సెలవిచ్చారు.


నిష్పక్షపాతంగా వార్తలు రాస్తే న్యూస్ ఛానళ్లు, వార్తా పత్రికలను నడపండి. లేదంటే మీ మనవడికి న్యాపీ ప్యాడ్స్ మార్చుకోండని సలహా ఇచ్చారు. ఇదే కాకుండా మొన్నటికి మొన్న  శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ పోస్టులో "జగన్ సార్, పాపం వేశ్యలు సార్ వారు దొంగలు కానీ నేరస్థులు కాదు సార్..వారు ఎవరికీ ఎటువంటి హాని చేయలేదండి ..పెద్ద పెద్ద వాళ్ళు కోట్లలో ప్రజల డబ్బు కొల్లగొట్టారు వారిని వదిలేసి. ఎందుకు సార్ ఈ వేశ్యలను మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. దచేసి మీరు పెద్ద చేపలపై దృష్టి పెట్టాలని వేశ్యలపై దృష్టి పెట్టవద్దని నేను పోలీసులను మరియు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను" అంటూపెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: