కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం ఎక్కడోకచోట ప్రచారం చేస్తూ బిజీ బిజీగా ఉంటాడు. అదృష్టం కలిసి రాలేదు కానీ ఈ గాంధీ వారసుడు ఎప్పుడో ప్రధాని అయ్యేవాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే .. శుక్రవారం  మహారాష్ట్ర, హర్యాణాలోని మహేంద్రగఢ్‌ అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల సమావేశానికి సోనియాగాంధీ రావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. 

          

దీంతో సోనియా గాంధీకి బదులుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ప్రచారం అనంతరం హెలికాప్టర్‌లో బయల్దేరిన రాహుల్ గాంధీ వాతావర్ణం సహకరించకపోవడంతో పర్‌ రివాడీలోని కేఎల్పీ కాలేజీ గ్రౌండ్ లో అత్యవసరంగా హెలికాప్టర్‌ని దించారు. అయితే అదే సమయంలో అక్కడ మైదానంలో యువకులు క్రికెట్ ఆడుతుండటంతో రాహుల్ గాంధీ కూడా వారితో పాటు కాసేపే బ్యాట్ పట్టి క్రికెట్ ఆడాడు. 

         

బ్యాటింగ్ బరిలోకి దిగిన రాహుల్ గాంధీ వేసిన ప్రతీ బాల్ ను గాల్లోకి దూసుకుపోయే విధంగా ఆడాడు. దీంతో అక్కడే ఉన్న కాండ్రేస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ బ్యాటింగ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియో చుసిన నెటిజన్లు అంత అబ్బా ఎంత బాగా కలిసిపోయాడు రాహుల్ గాంధీ అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు కామెంట్లు చేస్తూ రాహుల్ గాంధీ బై మిస్టేక్ రాజకీయాల్లోకి వచ్చాడు.. క్రికెట్ రంగంలోకి వచ్చింటే ఓ రేంజ్ లో ఆడుతుండే అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఒక్క వీడియోతో తన క్రికెట్ జ్ఞానాన్ని ప్రజలకు చూపించాడు.    

               

మరింత సమాచారం తెలుసుకోండి: