తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె గత 16 రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు తొలిగిస్తాం అని, సమ్మె మరింత ఉదృతం చేస్తామని చెప్తుంది. కానీ ప్రభుత్యం తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవటం లేదు, అయితే ఈరోజు మరో సంచలన ప్రకటన చేసింది.   

                

ఒక వైపు కోర్టు చర్చలు జరపాలని, సెప్టెంబర్ నెల జీతాలు (21 సెప్టెంబర్) సోమవారంలోగా చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చెయ్యగా నేడు హై కోర్టులో ఆర్టీసీ సమ్మెపై జరిగిన విచారణలో ఆర్టీసీ నష్టాలలో ఉందని, ఆర్టీసీలో జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పటంతో ఆర్టీసీ కార్మికులను షాక్ తగిలింది. 

               

దీంతో ఆర్టీసీ కార్మికులు అంత సమ్మెని ఇంకా ఉదృతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం కనికరించడం లేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. అయితే నిధులు ఉన్న కూడా ప్రభుత్వం దొంగ నాటకాలు చేస్తుందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. 

                     

మరోవైపు మీరు ఎంత చేసిన సరే.. మేము తగ్గేది లేదు అని ప్రభుత్వం అంటుంది. కాగా ఈ నెల 19వ తేదీన ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. ఈరోజు కూడా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కాగా ఇక 30వ తేదీన 5 లక్షల మందితో ఉస్మానియా యూనివర్సిటీలో సకల జనుల సమర భేరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

                   

మరింత సమాచారం తెలుసుకోండి: