ఆర్టీసీ సమ్మె గత 18 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి పువ్వాడ అజయ్, ఉన్నతాధికారులు నేడు భేటీ అయ్యారు. అయితే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించడంపై అధికారులు అంత చేర్చిస్తున్నారు.                

                                

కాగా ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆర్టీసీ విలీనం తప్ప మిగితా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశం ఉంది. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపించాలని హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. దీంతో తీర్పు కాపీని మంత్రి పువ్వాడ అజయ్ క్షుణ్ణంగా చదివారు.             

                        

సమ్మె తరవాత బస్సుల రవాణా, తదిర ఘటనలపై చర్చించారని సమాచారం. గ్రామాల్లో బస్సులు 90 శాతం తిరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సమ్మె కారణంగా ఉత్పన్నమైన పరిణామాలు, హైకోర్టు ఆదేశాలపై వ్వయహరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించారు. కాగా ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు.              

                           

మరింత సమాచారం తెలుసుకోండి: