వచ్చే ఎన్నికలకల్లా పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా కమలంపార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీని ఓ చూపు చూడాలని తాజాగా డిసైడ్ చేసిందట ఢిల్లీ నాయకత్వం. ఇందులో భాగంగానే టిడిపి నుండి తమ పార్టీలోకి చేరాలనుకుంటున్న పచ్చ నేతల జాబితాను రెడీ చేస్తున్నట్లు సమాచారం.

 

మొన్నటి ఎన్నికల్లో జనాలు కొట్టిన దెబ్బకు చంద్రబాబునాయుడు గూబగుయ్యిమన్న విషయం అందరికీ తెలిసిందే. ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ ఉక్రోషాన్ని జగన్మోహన్ రెడ్డి మీద కొద్ది రోజులు వైసిపికి అఖండ మెజారిటి ఇచ్చిన జనాలపై కొద్ది రోజులు అక్కసు చూపిస్తు కాలం వెళ్ళదీస్తున్నారు.

 

అదే సమయంలో చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం కోల్పోయిన కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి కుదిరితే వైసిపిలో లేకపోతే బిజెపిలో చేరిపోతున్నారు. టిడిపి నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు. ఇంకా చాలామంది నేతలు కమలం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలోనే వీలైనంతమంది నేతలను టిడిపిలో నుండి బిజెపిలో చేర్చుకోవాలని కమలం అగ్ర నేతలు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు రాష్ట్రనాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బిజెపి నేతలు కూడా జిల్లాల వారీగా టిడిపి నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు సమాచారం.

 

ఈనెలాఖరులో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా ఏపిలో పర్యటించబోతున్నట్లు బిజెపి వర్గాలు చెప్పాయి. అవకాశం ఉంటే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పర్యటించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అగ్రనేతల సమక్షంలో చాలామంది టిడిపి నేతలు కమలం కండువా కప్పుకోవటానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. తొందరలోనే జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనే బిజెపి సత్తా ఏంటో నిరూపించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అందుకు చాలామంది నేతలవసరం. కాబట్టే హోలు మొత్తం మీద టిడిపి నేతలనే టార్గెట్ గా పెట్టుకున్నారట.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: