ఢిల్లీ ప్రజలకు ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటున్నాయి. మొన్నటికి మొన్న మహిళలకు మెట్రో ప్రయాణం ఫ్రీ అని ప్రకటించారు. ఈరోజు ఓ నగరానికి సంబంధించి సుమారు 40 లక్షల మందికి సంతోషాన్ని ఇచ్చే విషయాన్నీ కేంద్రం ప్రకటించింది. 

                 

అది ఏంటి అని అనుకుంటున్నారా ? అదే చెప్తున్నా.. ఇంకా విషయానికి వస్తే.. ఢిల్లీలోని ఓ కాలనిలో గుర్తింపు లేని కాలనిలో నివసించే వారికీ యాజ‌మాన్య హ‌క్కులు కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జ‌వ‌దేక‌ర్ ఈ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. 

                               

ఈరోజు ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్రకాష్ జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు. ఓ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న‌గరంలో సుమారు 1797 గుర్తింపులేని కాల‌నీల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని నిర్ణయం తీసుకున్నాట్టు అయన చెప్పారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను అమ‌లు చేసేందుకు పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశంలో బిల్లును తీసుకొస్తున్నట్లు కేంద్ర గృహనిర్మాణం మంత్రి హరిదీప్ సింగ్ పూరి తెలిపారు.         

                       

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని మ‌రో మంత్రి హ‌ర్ష్ వ‌ర్ధ‌న్ స్వాగ‌తించారు. వ‌చ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 200 గ‌జాలు ఉన్న ఇంటి స్థ‌లానికి ఒక శాతం ప‌న్ను వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. మరి ఇది ఎప్పుడు అమలవుతుందో చూడాలి. 

                    

మరింత సమాచారం తెలుసుకోండి: