రాజకీయాల్లో ఎత్తు పల్లాలు చంద్రబాబుకు కొత్త కావు. ఆయన రాజకీయ జీవితమే గెలుపు వెనక ఓటమితో మొదలైంది. ఆ తరువాత కూడా ఆయన ఇంటా బయటా కూడా యుధ్ధం చేసి ప్రత్యర్ధులను ఎదుర్కొన్నారు. మొత్తానికి అన్నగారి  టీడీపీలో చివర్లో ప్రవేశించిన చంద్రబాబు పదేళ్ళ కాలంలోనే మొదటి స్థానానికి వచ్చేశారు. ఇక మామ ఎన్టీయార్ చేతుల్లో నుంచి పార్టీని లాగేశాక కూడా బాబు మూడు ఓటములను ఎదుర్కొన్నారు. తాజా ఓటమి మాత్రం బాబు జీవితంలోనే అతి పెద్దది, భయంకరమైనది.


ఇపుడు పోరాడాలని కోరిక ఉన్నా ఓపిక ఎంతవరకు ఉందన్నది మాత్రం తెలియడంలేదు. బాబు డెబ్బయి పడిలో ఉన్నారు. ఆయనలో జోష్ ఇపుడు కొంత తగ్గింది. పార్టీలో పరిణామాలు కూడా చికాకు పెడుతున్నాయి. తమ్ముళ్ళు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. దాంతో పార్టీని చక్కదిద్దడం  పెద్దాయనకు కష్టమైపోతోంది. బాబుదే పార్టీ అని ఉన్న వారు పట్టించుకోవడంలేదు. పోయిన వారు బాబు మీద బండలేస్తున్నారు. మరో వైపు  పొలిటికల్ గా బద్ద వ్యతిరేకిగా ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. కేంద్రంలో మోడీ సైతం కన్ను గీటినా కన్ను కలుపుతారన్న నమ్మకం లేదు. మరో నాలుగున్నరేళ్ళ తరువాత కానీ ఎన్నికలు లేవు.


ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో పార్టీని నడుపుకుని వస్తున్న బాబుకు సొంత కుటుంబంలో మద్దతు ఎంతవరకు ఉందన్నది చూస్తే కొడుకు లోకేష్ పట్టించుకోవడంలేదు. ఆయన ట్విట్టర్ ద్వారానే సందేశాలు పంపుతూ టైం పాస్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరో వైపు బావమరిది బాలక్రిష్ణ తన సిన్మాల్లో తాను ఉన్నారు. ఈ నేపధ్యంలో ఒంటిగానే బాబు పార్టీని నడిపించాల్సివుంది. ఇక పార్టీ కోసం బాబు ఎంత తపిస్తున్నా, మరెంత తిరుగుతున్నా కూడా క్యాడర్ కి ధీమా కలిగించలేకపోతున్నారు. మరీ వైపు కొత్త జనరేషన్ ఏపీలో ఉంది. వారికి ఆకట్టుకోలేకపోతున్నారు. ఓ విధంగా చూస్తే బాబు ప్రస్తుత రాజకీయ పయనం బాధని కలిగించేదే.


మరింత సమాచారం తెలుసుకోండి: