పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా జగన్ మీద పసలేని ఆరోపణలు .. కేసులు అంటూ ఆరోపణలు చేయడంతో గత ఎన్నికలో టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా ప్రజలు చిత్తుగా చిత్తుగా ఓడించారు. జగన్ మీద కేసులు ఉంటే వాటిని కోర్టులు తెలుస్తాయి. ఇప్పటి వరకు జగన్ కేసుల్లో ఉన్నవి ఆరోపణలు మాత్రమే .. ఇంకా నిర్దారణ కాలేదు. కానీ పవన్ మాత్రం జగన్ కేసులు గురించి పదే పదే ప్రస్తావించి జనాల్లో చులకన అవుతున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు చేసింది. కానీ జనాలు అవేమి పట్టించుకోకుండా భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ పాలన పట్ల విమర్శలు చేస్తే ఎవరు తప్పు పట్టరు. కానీ ఇంకా జగన్ మీద నిర్ధారణ కాని కేసుల గురించి పవన్ మాట్లాడటం మెజారిటీ జనాల్లో కోపం తెప్పిస్తుంది. 


త ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టకుండా .. ప్రతి పక్షములో ఉన్న జగన్ ను తిట్టడంతో ఎన్నికల్లో పవన్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ తన పంథాను మార్చుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోగానే .. జగన్ మీద ఎక్కడ లేని ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనితో సహజంగానే జనాల్లోకి పవన్ — బాబు ఒకటేనని ఫీలింగ్ వచ్చింది. అలా వచ్చేలా చేసింది పవన్ గారే. 


టీడీపీ ఐదేళ్లలో నోరెత్తని ఈ మేధావి ఇప్పుడేదో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతున్నట్టు పచ్చ మాటలు మాట్లాడ్తున్నారు. జగన్ ఇప్పటి వరకు పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీటిని మెచ్చుకునే నైజం పవన్ మేధావికి లేదు. క్లీన్ పాలిటిక్స్ అంటూ అందరి మాదిరిగానే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు. సీబీఐ కేసులకు జగన్ భయపడుతున్నారని .. టీడీపీ నాయకుడిలా సెలవిచ్చారు. ఇలా అయితే పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: