ప్రజాస్వామ్యంలో ప్రజలే  ప్రభువులు. వారిని మించి ఎవరూ లేరు, ఉండరు, ఎటువంటి వారికైనా వారి తీర్పు శిరోధార్యం. ప్రజల తీర్పులో ఎపుడు తప్పు ఉండదు, ఎందుకంటే ఇది సమాజం. ఏ ఒక్కరూ ఎవరినీ ప్రభావితం చేయలేరు. అందువల్ల అంతిమ న్యాయమూర్తులైన ప్రజలను కానీ, వారి తీర్పుని కానీ తప్పు పట్టడం, ఆరోపణలు  చేయాలనుకోవడం   అంటే దుస్సాహసమే. అది ఓ విధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే.


కానీ ఈ విషయంలో ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, కొత్తగా రాజకీయాల్లొకి వచ్చిన పవన్ ఒకేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వైసీపీని ఎన్నుకుని ప్రజలు తప్పు చేశారని ఇప్పటికి కొన్ని పదుల సార్లు చంద్రబాబు అక్కసు వెళ్ళగక్కారు. తనను ఓడించిన  ప్రజల పట్ల ఆయనకు ఉన్న ఆగ్రహం ఈ విధంగా బయటపెట్టుకున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసింది ఇదే ప్రజలు అన్న సత్యాన్ని బాబు లాంటి సీనియర్ నేత మరవడమే ఇక్కడ విచిత్రం.


ఇక బాబు బడిలోనే రాజకీయ ఓనామాలు దిద్దుకుంటున్నారని సెటైర్లు పడుతున్న  పవన్ కళ్యాణ్ సైతం బాబు మాటలను కాపీ పేస్ట్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు తప్పు చేశారంటూ పవన్ అనడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అందులో కూడా పవన్ తాను రెండు సీట్లలో ఓడిపోయాయన్న బాధ ఎక్కువగా కనిపిసోందని కూడా అంటున్నారు. పవన్ కి అయినా బాబుకైనా ప్రజలను మెప్పించి ఓట్లు తీసుకోవాలి కానీ నిందించి కాదన్న సత్యం తెలుసుకోవాలని ప్రజాస్వామప్రియులు అంటున్నారు.


ఇదిలా ఉండగా అయిదు నెలల కాలంలోనే వైసీపీ అనేక తప్పులు చేసిందని పవన్ చెప్పడాన్ని కూడా సహేతుకమైన విమర్శగా భావించలేమని అంటున్నారు. వైసీపీ చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇసుక కొరత లాంటి వాటి విషయంలో ఇబ్బందులు  ఉన్నాయి. పవన్ కొత్త రాజకీయం అంటున్నారు, అటువంటపుడు మంచి పనులు ముందు ప్రస్తావించి మిగిలినవాటిపైన విమర్శలు చేస్తే బాగుండేదని అంటున్నారు. పవన్ కూడా ఆ తానులో ముక్కనేననిపించుకుంటున్నారని,  ప్రతిపక్షం అంటే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఏ మాట అంటే అంటే అదే మాట పవన్ నోటి వెంట రావడం నిజంగా ఆలోచించాల్సిందేమరి.



మరింత సమాచారం తెలుసుకోండి: