మహారాష్ట్ర హర్యానా ఎన్నికల ఫలితాలతో పాటు దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాల్లో  ఉప ఎన్నికల ఫలితాలు నేడు  వెలువడనున్నాయి. దీంతో దేశ  రాజకీయాలు చూపు  మొత్తం ఎలక్షన్ల ఫలితాలు పైనే ఉంది . దేశం మొత్తం హర్యానా మహారాష్ట్ర ఎన్నికల వైపు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం హుజూర్నగర్ ఎలక్షన్స్ పై చేస్తున్నారు. అటు కర్ణాటక లో జరిగే ఎలక్షన్స్ కూడా ప్రభుత్వన్ని  నిర్ణయించనుండడంతో ఎవరు విజయం సాధిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు విజయం  తమనే వరిస్తుందని ధీమాలో ఉన్నారు. దీంతో  అన్ని పార్టీలు స్వీట్లు ఆర్డర్ ఇచ్చాయి. ఇక స్వీట్ల  దుకాణాల్లో పనిచేసే కార్మికులు రాత్రింబవళ్లు పనిచేసే స్వీట్లు తయారు చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర హర్యానా లో అయితే గెలుపు తమదే అని దృఢ నిశ్చయం తో వుంది బిజెపి పార్టీ. 

 

 

 ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడక ముందే భారీ మొత్తంలో స్వీట్లు రెడీ చేసాయట  బిజెపి వర్గాలు . ముంబైలోని బీజేపీ ఆఫీస్ లో లైవ్ కవరేజ్ ను ఏర్పాటు చేశారట. బిజెపి విజయం సాధిస్తే సెలబ్రేషన్స్ కోసం ఐదువేల లడ్డూలను కూడా సిద్ధం చేశారట. వీటితో పాటు బీజేపీ జెండా లు లడ్డూలు దండాలు కూడా రెడీ చేసి ఉంచారట. రెండోసారి కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని బిజెపి పార్టీ ధీమాతో ఉండడంతోనే..  ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో 288  అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి . 

 

 

 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ పరంగా చూస్తే బిజెపి ముందు  ఉంది. కాగా ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండగా అందులో కూడా బిజెపి హవా కొనసాగిస్తూ  మెజార్టీతో కొనసాగుతోంది. కాగా  దేశం మొత్తం హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వైపే చూస్తుంది . ఇక ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా  కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు

మరింత సమాచారం తెలుసుకోండి: