దేశ వ్యాప్తంగా  ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికల ఫలితాలు నేడు  విడుదల అవుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు సహా, దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే దేశం చూపు మొత్తం హర్యానా మహారాష్ట్ర ఎన్నికల వైపు ఉంది. ఎందుకంటే మరోసారి ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకునేది ఎవరని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక బిజెపి కాంగ్రెస్ ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని భారీగానే కసరత్తులు చేసాయి . ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు విడుదలైన మొదటి నుంచి బిజెపి తన హవా  నడిపిస్తుంది. మొదటి రౌండ్  నుంచి ఆధిక్యంలో కొనసాగుతు విజయ తీరాలవైపు పరుగులు పెడుతుంది బిజెపి. అయితే హర్యానా ఓటింగ్ ఫ్రెండ్స్ చూసుకుంటే బీజేపీకి షాక్ తప్పలేదు. మొదట ఆధిక్యంలో దూసుకుపోయిన బీజేపీ ఆ తర్వాత క్రమక్రమంగా ఆధిక్యాన్ని  కోల్పోతూ వస్తుంది. ఎన్నికల్లో ప్రస్తుతం పూర్తిస్థాయి మెజారిటీ బీజేపీకి కనిపించడం లేదు.

 

 

 

 హర్యానాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ... మరో చిన్న పార్టీ అయిన జేజేపీ  కమలం పార్టీని కలవరపెడుతుంది. 10 గంటల సమయానికి దాదాపుగా తొమ్మిది పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది జననాయక జనతా పార్టీ. అయితే దీన్ని బట్టి చూస్తే జేజేపీ అధినేత  దుశ్యంత్  కింగ్ మేకర్ గా మారబోతున్నట్లు  వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 31 ఏళ్ల యువకుడు దుశ్యంత్  బిజెపి పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు  రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది  అప్పుడే. 

 

 

 

 హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. కానీ కేవలం 37 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు కాంగ్రెస్ కూడా ముప్పై మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కించుకునేలా  కనిపించటం లేదు . దీంతో హర్యానాలో హంగ్ తప్పేలా లేదు. అయితే కౌంటింగ్ దృశ్య బీజేపీ నేతలు అప్పుడే ఇండిపెండెంట్ నేతలతో మంతనాలు మొదలు పెట్టారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కూడా జెసిపి చీఫ్ సుశాంత్ కు సీఎం సీట్ ఆఫర్ చేస్తుందని తెలుస్తుంది. తనకు మద్దతిచ్చే హర్యానా లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ తెలిపినట్లు సమాచారం. మరి హరియానా ఎన్నికల్లో చివరి రౌండ్  పూర్తయ్యేసరికి ఎవరు ఆధిక్యంలో నిలుస్తారో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: