పాపం.. కాంగ్రెస్. తెలంగాణాలో ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుంటే చాలు.. అక్కడా ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోని నాయకులకు సవాల్ గా మారినా హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. అయితే ఏదో రౌండ్ ముగిసేసరికి 14,300 ఓట్ల ఆధిక్యతతో టీఆర్ఎస్ గెలవనుంది.         

                              

2018 ఎన్నికల్లో కూడా మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పై టీఆర్ఎస్ భారీ స్థాయిలో గెలిచింది. ఫలితాలకు ముందు మేము గెలుస్తాం.. మేము గెలుస్తాం అని ప్రగల్భాలు పలికిన చివరికి ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ నుండి వరుసగా టిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు చేరుతూనే ఉన్నారు.        

                         

ఈ నేపథ్యంలోనే ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ ఓడిపోతే ఇంకా మళ్ళి రాదు అని అనుకున్నారు. కానీ కనువిను ఎరగని రీతిలో టీఆరఎస్ 17,400 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది. దీంతో అర్థమవుతుంది తెలంగాణాలో టీఆర్ఎస్ ఏ గెలుస్తుందని.. కాంగ్రెస్ గెలవడం అసాధ్యం అని. ఏది ఏమైనా కాంగ్రెస్ తెలంగాణాలో గెలవాలంటే అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుతో రాజకీయ విశ్లేషకులు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. 

                                 

మరింత సమాచారం తెలుసుకోండి: