తెలంగాణలో గత కొంత కాలంగా ఏ ఎన్నికలైన అధికార పార్టీ టీఆర్ఎస్ విజయ దుంధుబి మోగిస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల జరిగిన ఎమ్మెల్యె, ఎంపీ నుంచి మొన్నటి ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నిల వరకు టీఆర్ఎస్ సత్తా చాటుతూ వచ్చింది.  అయితే ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  ఈ నెల 21న హుజూర్ నగర్  లో బైపోల్ పోలింగ్ జరిగింది. నేడు ఎన్నికల ఫలితాలు ఉండంతో అక్కడ అంతా ఉత్కంఠ నెలకొంది. 

కాకపోతే మొన్నటి నుంచి అధికార పార్టీనే ఎమ్మెల్యే పదవి కైవసం చేసుకుంటుందని అంటుంటే..ఆర్టీసీ, ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్ ఈసారి ఉపఎన్నికల్లో ఉండబోతుందని కామెంట్స్ కూడా వినిపించాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఆర్టీసీ సమ్మె 20వ రోజుకు చేరుకుంది..దాంతో ఆర్టీసీ తరుపు నుంచి మొన్నటి వరకు ప్రతిపక్ష నేతలు కూడా పదం కలిపారు.  దాంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో అని కొంతమంది భావించారు.  కానీ అంతా తలకిందులై..వారి అంచనాలు పూర్తిగా విరుద్దమయ్యాయి. 

10 రౌండ్ల కౌంటింగ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: