మ‌రాఠాల ప్రతీక‌గా ఉన్న శివ‌సేనలో మ‌రో కొత్త ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. శివ‌సేన త‌ర‌ఫున మొట్ట‌మొద‌టి సారిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన యువసేన చీఫ్‌ ఆదిత్య థాకరే(28) విజ‌యం సాధించారు.వ‌ర్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆదిత్య పోటీ చేశారు. యువనేత‌కు 70 వేల ఓట్లు పోల‌య్యాయి. ఎన్‌సీపీ నేత‌పై ఆయ‌న గెలుపొందారు. 


ఆదిత్య రాజకీయ అరంగేట్రంపై యువసేన నాయకుడు వరుణ్‌ సర్దేశాయ్ మొద‌టిసారిగా ఇన్‌స్టాగ్రాం వేదికగా పోస్టు చేశారు. ఆదిత్య థాకరే కోసం మహారాష్ట్ర వేచి చూస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. అనంత‌రం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన తండ్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ఓకే చెప్ప‌డంతో...మహారాష్ట్రలో జరిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య థాకరే ముందుకు వ‌చ్చారు. నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు వెళ్లే ముందు ఆదిత్య‌.. ఇంట్లోనే శివ‌సేన వ్య‌వ‌స్థాప‌కుడు, తాత‌య్య బాలా సాహేబ్ థాక‌రే ఫోటో వ‌ద్ద ఆస్సులు తీసుకున్నారు. ఆదిత్య థాక‌రే త‌న ఆస్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించారు. ఆయ‌న ఆస్తి మొత్తం 16 కోట్ల 5 ల‌క్ష‌లు. అతని వ‌ద్ద ఓ బీఎండ‌బ్ల్యూ కారు కూడా ఉన్న‌ది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఈ వివ‌రాల‌ను ఆదిత్య పేర్కొన్నారు.


ఇదిలాఉండ‌గా, శివ‌సేన త‌న అన్ని స్థానాల‌ను దాదాపు గెలుచుకుంది. బీజేపీ మాత్ర‌మే త‌న స్వంత సీట్ల‌ను ఎక్కువ శాతం కోల్పోయింది. అయితే సీఎం ఎవ‌ర‌న్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది. శివ‌సేన త‌ర‌పున పోటీలో నిలిచిన ఆదిత్య థాక‌రే.. సీఎం అవుతారా లేదా అన్న ప్ర‌శ్న‌ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సీఎం ఫ‌డ్న‌వీస్ త‌న ప‌ద‌విని నిలుపుకుంటారా లేక శివ‌సేన‌కు అర్పిస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మ‌రోవైపు, శివసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి శివసేనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన మంత్రి పదవులు సగం, సగం పంచుకోవాలని తెలిపారు. ఈ విషయం తాను పార్టీ అధినేత ఉద్దవ్ థాకరేతో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు. 


కాగా, 29 ఏళ్ల ఆదిత్య‌.. యువ‌సేన ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్నారు. తాత బాల్ థాక‌రే త‌ర‌హాలో.. ఆదిత్యకు సాహిత్యం అంటే మ‌క్కువ‌. 2007లోనే ఆదిత్య మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ పుస్త‌కాన్ని రాశారు. 2008లో పాటలు రాసి, ఓ ప్రైవేటు ఆల్బాన్ని రిలీజ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: