తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది. అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల   విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. కాగా  కోర్టు కార్మికులతో చర్చలు జరపాలని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరగలేదని.... ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ మొండి వైఖరి అవలంబిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే  ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే  వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పింది ఆర్టీసీ జేఏసీ...  ప్రతిపక్షాలు కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. 



 అయితే తాజాగా ఆర్టీసీ సమ్మె పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే  సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకొన్న కేసీఆర్... మరోసారి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ ఆర్టీసీ సమ్మె ఇప్పటికే 20 రోజులు చేరుకున్న నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ స్పందించకపోతే ఆర్టీసీ సమ్మె ముగింపు ఏంటని  అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ముగిసేది ఆర్టీసీ సమ్మె కాదని ఆర్టీసీ సంస్థ  ముగుస్తుంది అని తేల్చి చెప్పారు. ఇలా కావడానికి కారణం కేవలం ఆర్టీసీ యూనియన్ల, ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలేనని కేసీఆర్ తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 67% ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచితే... ఆర్టీసీ సంస్థకు లాభాలు వచ్చే సమయంలో ఆర్టీసీ కార్మికులు  సమ్మె బాట పట్టరాని  ఆగ్రహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని... ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగతా 57 కార్పొరేషన్ లను  కూడా ప్రభుత్వం లో విలీనం చేయాల్సి వస్తుందని కేసీఆర్ తెలిపారు. 



 ఆర్టీసీ కార్మికులందరూ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేశారని చెబుతున్నారని... కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం చేయడానికి కమిటీ వేసింది కానీ అది ఏమవుతుందో దేవుడికే తెలియాలి అని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ  ప్రభుత్వం వేసిన కమిటీ ఇంకో మూడు నుంచి ఆరు నెలల్లో నివేదిక అందిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కమిటీ వేశారు కానీ విలీనం చేయాలేదని  అది కేవలం ప్రయోగం మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ని  ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కమిటీని నియమించారని  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఒకవేళ  ఆర్టీసీ సంస్థను  ప్రభుత్వంలో విలీనం చేస్తే 53,229 మంది  ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులగా మారుతారన్నారు కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి: