ఒకవైపు ఆర్టీసీ సమ్మె... మరొక వైపు చూస్తే హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పైగా లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన భారీ షాక్ లు. వీటన్నింటి నడుమ ఉప ఎన్నికలకు ప్రయాణమైన టిఆర్ఎస్ తెలంగాణలో తిరుగులేని పార్టీ అని మరోసారి నిరూపించుకుంటుందా లేదా అన్న సందేహాలు అందరికీ ఉన్నాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తెరాస చివరికి రికార్డు మెజారిటీతో విజయబావుటా ఎగురవేసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో విపరీతమైన ఆనందం వెల్లువెత్తింది. ఇటీవల కాలంలో వారి మొహంలో పోయిన కళ అంతా బయటికి కొట్టుకొచ్చింది. కానీ ఒక్క కెసిఆర్ మాత్రం ఆందోళనతో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయాడట.

విషయం ఏమిటంటే నిజామాబాద్ లోక్ సభ సీటు ఓడిపోయిన తర్వాత కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పూర్తిగా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింది. తెలంగాణ జాగృతి వ్యవహారాల్లో కూడా ఆమె పెద్దగా కనిపించలేదు. ఆమె రాజకీయ భవిష్యత్తు సందిగ్దంలో పడిన నేపథ్యంలో హుజూర్నగర్ ఫలితం టిఆర్ఎస్ కు అనుకూలంగా రావడంతో ఆమె ఉత్సాహాన్ని ట్వీట్ రూపంలో చాలా కాలం తర్వాత బయటకు వెల్లడించారు. 

అయితే ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఆమె కూతురు కవితను నిలబెడదామని అనుకున్నారు. కానీ ఏమీ ఆలోచించాడో ఏమో తెలియదు కానీ కెసిఆర్ కవిత బదులుగా సైదిరెడ్డిని  నిల్చోబెట్టాడు. ఒకవేళ కవిత కనుక పోటీ చేసి ఉంటే మళ్లీ ఆమె అనూహ్యరీతిలో పరాజయం చవిచూసేదా లేక భారీ విజయంతో పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందా అన్నది మనం స్పష్టంగా చెప్పలేం. అయితే తన కూతురు మాత్రం ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది అని మాత్రం కచ్చితంగా కెసిఆర్ కు తెలుసు. అందుకే ఈ బాధంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: