పవన్ కళ్యాణ్ .. జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు తన రాజకీయానికి తానే గొయ్యి తవ్వుకున్నట్లు కనిపిస్తుంది. జగన్ కేసులకు భయపడుతున్నాడని పవన్ మేధావి సభల్లో చెప్పుకుంటున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పొద్దున్న నుంచి ఇదే మాదిరిగా జగన్ కేసుల గురించి ప్రస్తావిస్తూ వచ్చింది. కానీ జనాలు టీడీపీకి బుద్ధి చెప్పి జగన్ ను గెలిపించారు. జగన్ మీద ఇప్పటి వరకు కనీసం ఒక్క కేసు కూడా నిలబడిన ధాఖలు లేవు. అలాంటింది జగన్ కేసుల గురించి ఎందుకు భయపడతారు. ఒక వేళ జగన్ కేసులకు భయపడితే ఇన్నేళ్లు ప్రత్యేక హోదా అంటూ కేంద్రం మీద యుద్ధం ఎందుకు ప్రకటిస్తారు. నిజంగా జగన్ కేంద్రంతో లాలూచి పడి ఉంటే .. సీబీఐ జగన్ కు కోర్ట్ హాజరు నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వదు. కానీ ఇవేమి పవన్ మేధావికి అవసరం లేదు. 


జగన్ మీద కేసులు ఉంటే వాటిని కోర్టులు తెలుస్తాయి. ఇప్పటి వరకు జగన్ కేసుల్లో ఉన్నవి ఆరోపణలు మాత్రమే .. ఇంకా నిర్దారణ కాలేదు. కానీ పవన్ మాత్రం జగన్ కేసులు గురించి పదే పదే ప్రస్తావించి జనాల్లో చులకన అవుతున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ కూడా ఇదే మాదిరిగా ఆరోపణలు చేసింది. కానీ జనాలు అవేమి పట్టించుకోకుండా భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ పాలన పట్ల విమర్శలు చేస్తే ఎవరు తప్పు పట్టరు. కానీ ఇంకా జగన్ మీద నిర్ధారణ కాని కేసుల గురించి పవన్ మాట్లాడటం మెజారిటీ జనాల్లో కోపం తెప్పిస్తుంది. 


గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టకుండా .. ప్రతి పక్షములో ఉన్న జగన్ ను తిట్టడంతో ఎన్నికల్లో పవన్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ తన పంథాను మార్చుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ఓడిపోగానే .. జగన్ మీద ఎక్కడ లేని ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనితో సహజంగానే జనాల్లోకి పవన్ — బాబు ఒకటేనని ఫీలింగ్ వచ్చింది. అలా వచ్చేలా చేసింది పవన్ గారే. ఇలా పవన్ తన గొవ్వి తానే తవ్వుకుంటున్నారు !


మరింత సమాచారం తెలుసుకోండి: