హుజూర్‌నగర్ ఉప-ఎన్నికల్లో టీఆరెస్ ఓటమి ఖాయం అని అనుకున్నారు అంతా. అంతటితో ఊరుకోకుండా తెలంగాణ ఆర్టీసి చేస్తున్న సమ్మె తాలూకు ప్రభావం గులాభి పార్టీపై పడుతుందని భావించారు. ఇక్కడ టీఆరెస్ బొమ్మ అట్టర్ ఫ్లాప్ అని, కాంగ్రెస్‌కు కంచుకోట ఐన ఈ స్దానాన్ని గులాభి పార్టీ చేధించలేదని ధీమాతో ఉన్నారు. కాని ఫలితం తారుమారైంది. ఎరెవరు ఏమేమి ఊహించుకున్నారో వారందరికి కళ్లు బైర్లు కమ్మేలా అధిక మెజారిటితో గులాభి జెండాను హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎగరేసారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ఆర్టీసి కార్మికనేతల అంచనాలు తారుమారవ్వడంతో ఇప్పటివరకు పెట్టుకున్న ఆశలు ఒక్క సారిగా ఆరిపోయే పరిస్దితులు తలెత్తుతున్నాయి.


ఇక ఈ సందర్భంలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండబోదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చిపంథాలో సమ్మె చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని, ఈ పరిస్దితుల్లో ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, ఇన్నాళ్లనుండి చేస్తున్న సమ్మెవల్ల ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. కార్మికులు తక్షణమే దిగిరావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు.


ఇకపోతే ఆర్టీసీ యూనియన్ల నాయకులే ఆర్టీసీని ముంచుతున్నారని ఆరోపించారు. యూనియన్ల చిల్లర రాజకీయాలతో ఆర్టీసీకి భారీ నష్టాలు తెచ్చిపెట్టారని మండిపడ్డారు. ఇంతేకాకుండా మీకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర కూడా డబ్బుల్లేవు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదు. ఈ యూనియన్లే ఆర్టీసీని ముంచాయి. ఇకపై కూడా ఇలాంటి యూనియన్లు ఉండి ఇదే గొంతెమ్మ కోరికలు కోరితే ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. కార్మికులతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పనిచేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. ఆర్టీసీ సమ్మెకు ముంగింపు ఆర్టీసీ ముగింపే అని పలకడంతో ఇప్పటివరకు సమ్మెచేస్తున్న కార్మికుల గుండెల్లో ఏ మంటలు చెలరేగుతున్నాయో అర్ధం కావడంలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణ ఆర్టీసి గందరగోళంలో పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: