చంద్రబాబునాయుడును 23 సంఖ్య వదలకుండా పీడకలలాగ వెంటాడుతునే ఉంది. ఏ ముహూర్తాన చంద్రబాబు ఫిరాయింపులను మొదలుపెట్టారో అప్పటి నుండే 23 సంఖ్య చంద్రబాబును వదలకుండా వెంటాడుతోంది. తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నికలో టిడిపికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. డిపాజిట్ రాకపోగా వచ్చిన ఓట్లు కేవలం 1895.  వచ్చిన  ఓట్లను మొత్తం కూడితే 1+8+9+5= వచ్చేది 23.

 

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల సంఖ్య కూడా 23. ఇక పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి నడుపుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులను రవాణా శాఖ సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న చాలా బస్సులపై కేసులు నమోదు చేసింది. అయితే సీజ్ చేసిన బస్సుల సంఖ్య కూడా ఇరవై మూడే.

 

మొన్నటి ఎన్నికల ఫలితాలు వెలువడింది కూడా మే నెల 23వ తేదీనే అన్న విషయం గమనార్హం. ఇదే విషయాన్ని మొదటిసారి అసెంబ్లీ  సమావేశమైనపుడు జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 23 సంఖ్య గురించి జగన్ ప్రస్తావించినపుడు చంద్రబాబు మొహం మాడిపోయిన విషయం కూడా అందరూ చూసిందే.

 

ఒకపుడు తెలుగుదేశంపార్టీని ఆగష్టు సంక్షోభం పట్టి పీడించేది. మొదటిసారి ఎన్టీయార్ ను ముఖ్యమంత్రిగా దింపేసింది ఆగష్టులోనే. తర్వాత ఒక్కసారిగా మంత్రులను ఎన్టీయార్ బర్తరఫ్ చేసింది కూడా ఆగష్టులోనట. ఆ తర్వాత 1994లో ఎన్టీయార్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సిఎం పదవిని లాక్కున్నది కూడా ఆగష్టులోనే.

 

పార్టీ ఇబ్బంది పడిన ఇలాంటి చాలా ఘటనలు ఆగష్టులోనే  జరగటంతో ఆగష్టు వస్తోందంటేనే నేతలు భయపడేవారు. అలాంటిది ఇపుడు ఆగష్టు సంక్షోభం తర్వాత 23 సంఖ్య చంద్రబాబును వదలకుండా వెంటాడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: