ఒక సముద్రంలో గమ్యాన్ని చేర్చే నౌక సాఫీగా సాగుతుంది. కాని ఆ నౌకలో ఉన్న కొందరి మదిలో మంచి ఆలోచనలుంటే, మరికొందరి మదిలో అర్ధం లేని ఆలోచనలు మెదులుతున్నాయి. అప్పుడే గాలి తుఫాను వచ్చి ఆ నౌక గమ్యాన్ని చెల్లా చెదురు చేసింది. దాంతో అందులో ఉన్న వారు పుట్టకొకరు, చెట్టుకొకరులా చెదిరిపోయారు.. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసి పరిస్దితి ఇలాగే మారింది. తెరచాటు ఏం జరుగుతుందో నాయకులకు, పాలకులకు తెలుసు. కాని మధ్యలో కార్మికులు, ప్రజలు ఆగమైపోతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఆర్టీసీలో పనిచేసే కార్మికులు మాత్రం చెప్పుకోలేని వేదన చెందుతున్నారు. మరికొందరైతే ప్రాణత్యాగాలు కూడా చేసారు.


ఈ దశలో ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు తప్పతడుగు వేసారా?, లేక సరైన నిర్ణయం తీసుకున్నారా ? అనే అనిశ్చిత స్దితిలో ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు కేసీయార్ సమ్మె విషయంలో తీసుకునే నిర్ణయానికి బాధ్యత వహించేదేవరు ?. పరిస్దితి ఇలామారడానికి కారణం ఎవరనే విషయాన్ని పక్కన బెడితే ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు కాని ఇకముందు గాని ఏం జరిగిన బాధ్యత వహిస్తారా ?. ఇన్నివేయిల మంది కార్మికులకు న్యాయం ఎవరు చేస్తారనే ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుంది ?. అంతవరకు కార్మిక కుంటుంబాలు జీతాలు లేక విలవిల మాడవలసిందేనా ?


రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న సంక్షోభానికి కారకులు ఎవరు ? అనే విషయాలు ఇప్పుడు చాలా హట్ టాపిక్‌గా మారింది. ఈ దసరా పండగకు బస్సులు నడిపి ఉండవలసింది ఎందుకంటే అసలే నష్టాల్లో వుందని చెబుతున్న ఆర్టీసికి కాసింతైన ఊపిరి అందేది. అప్పుడు ఇంతగా రాద్దాంతం జరగక పోయేది కావచ్చూ. అసలే నష్టాలు అనే గాయాన్ని ఏర్పరచుకున్న తెలంగాణ ఆర్టీసీ మీద సమ్మే అనే కారం చల్లేసరికి గాయం పెద్దదైంది. సరైన సమయంలో ఈ గాయాన్ని మానిపే చర్యలు ఎవరు చేపట్టకపోవడంతో ఇప్పుడు సమ్మె పరిస్దితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందనుకుంటున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: