తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మే నేటితో 21వ రోజు పూర్తి కావస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు ఎన్నడు లేనంతగా మాటల యుద్దం తీవ్ర స్దాయికి చేరుకుంటుంది. ఒక విధంగా ఉప ఎన్నికలవరకు కేసీయార్ సమ్మె విషయంలో చాలా ప్రశాంతంగానే సమాధానాలు ఇచ్చారు.


ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన మాటల్లో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తును కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఒకరకంగా తెలంగాణ ఆర్టీసీకీ ముగింపు పలికే సమయం ఆసన్నమైందనే అర్ధం అందులో గోచరిస్తుంది. కాని కేసీయార్ అనుకుంటున్నట్లుగా ఆర్టీసీని మూసివేయడం సాధ్యమేనా అంటే సుమారుగా 40 వేయిల మంది కార్మికుల భవిష్యత్తు వీధిపాలవుతుంది.


ఈ చర్యవల్ల మరెన్ని కార్మిక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటాయో తెలియదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నెలకొనే ఉద్రిక్త పరిస్దితులకు బాధ్యులు ఎవరు ? అనే విషయాలన్ని పరిగణించవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే న్యాయస్దానాలకు ప్రభుత్వ ఏం సమాధానం చెబుతుంది ?. ఇకపోతే సమ్మెవిషయంలో ప్రజలు అసంతృప్తితో వున్న విషయం బయటకు రావడం లేదనుకుంటున్నారు,


కాని ఎంతోమంది సమ్మె వల్ల జరిగే నష్టానికి బాధపడుతున్నారో బయటకు తెలియడం లేదు. కాని రాష్ట్రంలో అనుకోని క్రిటికల్ పరిస్దితులు సంభవించిన తరుణంలో ఇప్పటివరకు సపోర్ట్ చేయడం లేదనుకుంటున్న ప్రజలు ఏకమై ఒక్కసారిగా తిరుగుబాటు చేయరనే గ్యారంటి ఏంటి ?. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అని పిలవబడుతుందా ?..


ఉద్యమాలకు ఊపిరిగా ఉన్న తెలంగాణాలో మరో ఉద్యమం ఊపిరి పోసుకుంటుందా ? ప్రతి పక్షాలన్ని ఏకమై కార్మిక సంఘాలకు మద్దతుగా మరో పోరాటాన్ని ముందుకు నడిపిస్తాయా?  అందుకే ఇప్పుడున్న సమస్యను చిన్నదిగా భావించకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో నుండి వినిపిస్తుంది... 


మరింత సమాచారం తెలుసుకోండి: