సినిమాల్లో హీరోయిజం చూపించడంతో మేటి పవన్ కళ్యాణ్. కానీ రాజకీయాల్లో మాత్రం అవి కుదరవు కదా. ఇక్కడ జనం చూస్తారు. వారికి కావాల్సింది రియల్ హీరోయిజం. మరి పవన్ రాజకీయాల్లో ఇంకా సిన్మా డైలాగులే చెబుతున్నారని ఓ వైపు కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్  రాజకీయ విమర్శల పైనా కూడా విమర్శలు వస్తున్నాయి. ఆయన  ఒక వైపే చూస్తున్నారని కూడా అంటున్నారు.


ఇదిలా ఉండగా మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడుతూ వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, వారు విమర్శలు  ఆపకపోతే ఎన్నికల్లు తొందరలోనే వస్తాయంటూ హెచ్చరికలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. లారీ యజమనులు ఇసుక కొరత విషయంలో పవన్ కళ్యాణ్ణి కలసినపుడు ఆయన ఈ రకమైన కామెంట్స్ చేశారని చెబుతున్నారు. ఓ విధంగా చూస్తే ఇవి  కాస్తా జాగ్రత్తగా ఆలోచించాల్సిన  కామెంట్స్ గానే ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా అయిదు నెలల క్రితం ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చింది. ఎన్నికలు మరో నాలుగున్నరేళ్ళ దూరంలో ఉన్నాయి. మధ్యలో ప్రభుత్వం పడిపోవడాలు ఉంటేనే తప్ప ఎన్నికలు రావు. అలాంటిది పవన్ ఈ రకమైన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాక ఎన్నికలు ఎందుకు తొందరగా వస్తాయన్న సందేహం అందరికీ కలుగుతుంది.


ప్రభుత్వం పడగొడితేనే ఎన్నికలు వస్తాయి. 151 మంది ఎమ్మెల్యేల బలంతో ఉన్న జగన్ సర్కార్ ని పడగొట్టే దమ్ము ఎవరికి ఉందన్న ప్రశ్న కూడా ఉంది. మరి తాను పోటీ చేసిన రెండు సీట్లను కోల్పోయిన  పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ని కూలగొట్టగలరా అన్నది కూడా హాస్యాస్పదమైన చర్చగానే చూస్తున్నారు. కానీ పవన్ ఈ మాటలు ఉపయోగించడం వెనక ఉన్న అసలు విషయం ఏంటన్నదే ఇపుడు చర్చగా ఉంది. అంటే ఏపీలో జగన్ సర్కాన్ని కూలగొట్టేందుకు ఏమైనా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయా అన్నది కూడా పవన్ మాటల బట్టే అర్ధమవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు కూడా జగన్ పాలన ఎక్కువ కాలం ఉండదని అంటున్నారు. ఇపుడు పవన్ వారితో గొంతు కలిపి ఎన్నికలు తొందరగా వస్తాయని అంటున్నారు. దీని భావమేమి పవన్ కళ్యాణూ అంటున్నారు వైసీపీ నేతలు. 


ఇదిలా ఉండగా బంపర్ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని అయిదేళ్ళు పనిచేయనివ్వాలి కానీ  ఈ రోజూ రేపూ  ఎన్నికలు వచ్చేస్తాయి అంటూ మాట్లాడడం ప్రజాస్వామ్య‌ స్పూర్తికి విరుధ్ధమని  ప్రజాస్వాయ్మప్రియులు అంటున్నారు. మరి చూడాలి పవన్ ఎందుకు ఈ మాటలు వాడారో, వాటి వెనక అర్ధాలు  ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: