బీజేపీ పార్టీ పుట్టిందే మతం పునాదుల మీద. ఇప్పటికి కూడా మతాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలనికుంటుంది. మొన్నటివరకు బీజేపీ పార్టీకి ప్రజలు తిరుగులేని మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు షేరు భారీగా పడిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 30.5 శాతం ఓటు బ్యాంకును కొల్లగొడితే ఇప్పుడు కేవలం 21.5 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు .. బీజేపీ ఇకనైనా తన రాజకీయాలను మార్చునుకోవాలని. పార్లమెంట్ ఎన్నికలప్పుడు అన్నీ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనితో ఇక మోడీసారధ్యంలోని బీజేపీకి తిరుగు లేదనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి ఝలక్ ఇచ్చారు. 


మహారాష్ట్ర ఎన్నికల్లో గత పర్యాయంలో బీజేపీకి వచ్చిన సీట్ల కంటే సుమారు 23 స్థానాలు ఇప్పుడు తగ్గిపోయాయి. మొత్తం 288 స్థానాల్లో బీజేపీకి వచ్చింది కేవలం 101 స్థానాలంటే అర్ధం చేసుకోవచ్చు బీజేపీ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని .. మరో పక్క శివసేనకు కూడా మూడు నాలుగు సీట్లు తగ్గిపోయాయి. శరద్ పవర్ నాయకత్వంలోని పార్టీకి సీట్లు భారీగా పెరిగినాయి. అయితే తాజా ఎన్నికల్లో బీజోకి సీట్ల తగ్గుదల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆశలు పెంచుకోవచ్చు.


ఓటర్లు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారని తాజా ఎన్నికలే నిదర్శనమని చెప్పాలి. అయితే హర్యానాలో కూడా బీజేపీ పరిస్థితి దిగజారి పోయింది. గత పర్యాయంలో వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయి. మరో పక్క కాంగ్రెస్పార్టీ బలం పుంజుకుంది. అయినా హర్యానాలో బీజేపీ పార్టీ స్వతంత్ర అభ్యర్థుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు.  ఇక మహారాష్ట్రలో కూడా శివసేన కూటమితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అయితే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేకపోయినా .. బీజేపీ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: