ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత వల్ల... భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కరువైందని... భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడ్డాయని ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ  విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత ఉన్నది అని తెలిసినప్పటికీ కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తూ... ఆంధ్ర ప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా... ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు ఆపడం లేదు. 



 ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా ప్రతిపక్షాలు ... ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెబుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర  విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే . అంతేకాకుండా భవన నిర్మాణ రంగ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని జనసేన నేతలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన... తాజాగా భవన నిర్మాణ కార్మికుల తో కలిసి జనసేన నేతలు విశాఖలోని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు. 



 మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించిన జనసేన నేతలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని... ఇసుక కొరతతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని... ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని అంటూ నినదించారు. ఈ సందర్భంగా కార్మికులు జనసేన నేతలతో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కష్టాలను మంత్రి అవంతి శ్రీనివాస్ కు వివరించారు భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్... వీలైనంత త్వరలో రాష్ట్రంలో ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే కొన్ని పార్టీలు కావాలని ఇసుక కొరత అంశాన్ని  వివాదాస్పదం చేస్తున్నాయన్న  మంత్రి అవంతి శ్రీనివాస్... ఇసుక కొరత అంశాన్ని  వివాదాస్పదం చేస్తూ తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: