హిందువులందరూ అంగరంగ వైభవంగా... దీపాల వెలుగులు, టపాకాయల మెరుపుల్లో జరుపుకునే   పండుగ దీపావళి. హిందువుల ముఖ్య పండుగలలో ఒకటైన దీపావళి పండుగను... దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి వేడుకల్లో తారాజువ్వల మోతలతో సందడిగా మారే ఈ దీపావళి ఆశ్వయుజ  మాసంలో వస్తుంది. భారత సాంప్రదాయంలోనే అతి ముఖ్యమైన పండుగ దీపావళి మూడు రోజుల పాటు జరుగుతుంది. దీపావళి పండుగనాడు ప్రతి ఇళ్లు  దీపాల వెలుగుల్లో  ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ రోజుల్లో రోజురోజుకీ ప్లాస్టిక్  దీపాలు వెలిగించినప్పటికీ కూడా .... నూనె పోసి దూది  పెట్టి దీపం వెలిగిస్తే ఎంతో మేలు. 

 

 

 

 దీపావళి కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం రండి ... దీప అంటే దీపం ఆవళి అంటే వరుస అని అర్దాలున్నాయి ... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాలను సంపద ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తారు హిందువులు. అందువలనే దీపావళి పండుగను పురస్కరించుకుని దీపాలను వెలిగించి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇలా వరుసగా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహించి ఇబ్బందులన్నీ దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. 

 

 

 

 దీపావళి పండుగ నాడు సాయంత్రం వేళ ప్రజలందరూ తమ ఇంటిముందు... మరికొన్ని ఇతర చోట్ల దీపాలు వెలిగిస్తారు. అయితే ఇంటి  ముందు అయితే దీపాలు వెలుగుతూనే ఉంటాయో  ఆ ఇంట మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం. అంతే కాకుండా చనిపోయిన  వారికి పెద్దల పండుగగా జరుపుకొని  తర్పణలు ఇస్తుంటారు కొంతమంది. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పితృదేవతలకు తిరిగి స్వర్గ లోకాలకు వెళ్లేందుకు దీపాలు ద్వారా వెలుతురు చూపించడం కోసమే దీపాలు వెలిగించే ఆచారం ఉందని ప్రతీతి. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉన్న వారైనా లేని వారైనా ఉన్నంతలో దీపావళి పండుగను జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: