భారతదేశ పండుగల్లో  ఎంతో విశిష్టమైన పండుగ దీపావళి. ఉత్తర భారత దేశమైనా... దక్షిణ భారత దేశంలో నైనా దీపావళి పండుగ నాడు జరుపుకునే కార్యక్రమాల్లో అతిముఖ్యమైనది... లక్ష్మీదేవి పూజ. దీపావళినాడు వరుసగా దీపాలు వెలిగిస్తే లక్ష్మి దేవి కటాక్షం లభించి సమస్యలన్నీ దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజలు నమ్ముతారు. చిన్నలు పెద్దలు అందరూ కలిసి లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవుతారు. లక్ష్మీదేవి అతి ఇష్టమైనది శుభ్రత... అందుకే దీపావళి నాడు ప్రతి ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగించి వివిధ రకాల ముగ్గులు వేసి పూలతో అలంకరిస్తారు. 

 

 

 

 శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు బొట్టు పెట్టి దీపావళి రోజున పూజిస్తారు. లక్ష్మీ దేవి అమ్మవారు తాము వెలిగించిన ప్రతిమల వెంట ఇంట్లోకి రావాలని... వరుసగా దీపాలు లేకపోతే రంగురంగుల విద్యుత్ దీపాలను వరుసగా అలంకరిస్తారు. ఇక దీపావళి నాడు ఎంతో నిష్ఠతో జరిపే  లక్ష్మీదేవి పూజ ను ఎలా నిర్వహిస్తారో అంటే... లక్ష్మీదేవి పూజలు ముఖ్యం గా వినాయకుడు,  మాత లక్ష్మీ దేవి ప్రతిమలను పూజిస్తుంటారు. ఏ పూజ చేసిన ఆదిదేవుడైన వినాయకుడిని ముందుగా పూజించాలి. అయితే లక్ష్మీ దేవిని ఆమె మూడు స్వరూపాలైన లక్ష్మీ దేవి,  సరస్వతి, మహా కాళి రూపాలలో పూజిస్తారు భక్తులు. వీరితో పాటు ధనానికి  మూలమైన కుబేరుడిని కూడా పూజిస్తారు. 

 

 

 

 పూజా విధానం ఎలా ఉండాలంటే... కొద్దిగా ఎత్తుగా ఉండేలా పీట వేసి దానిపై ఎర్రపరిచి  పరిచి  మధ్యలో బియ్యం పోసి... ఆ బియ్యంపై అలంకరణ చేయబడిన కలశాన్ని  పెట్టాలి. కలశంలో మూడు వంతుల నీరు తమలపాకులు మామిడాకులు కొన్ని నాణాలు  వేసి... కలశంపై ఒక గిన్నె పెట్టి దాని నిండా బియ్యం పోయాలి.కలశంపై  స్వస్తిక్ గుర్తు వంటివి వేయాలి . కలశంపై బియ్యం పెట్టిన గిన్నెలో  లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహానికి నైరుతీ వైపున వినాయకుడి విగ్రహం ఉండాలి. పిల్లల పుస్తకాలు మరియు వ్యాపారానికి సంబంధించిన ఇతర పత్రాలు  కూడా లక్ష్మీదేవి విగ్రహం ముందు ఉంచాలి. సువాసన వెదజల్లే అగర్ బత్తీలను   వెలిగించడం తో పాటు పసుపు కుంకుమ అందుబాటులో ఉంచుకుని నెయ్యి పాలు పెరుగు ఇలా పంచామృతం తయారు చేయాలి.

 

 

 

పండ్లు పూలు తీపి పదార్థాలు లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించాలి. ముందుగా గణపతిని పూజించిన అనంతరం... లక్ష్మీ అష్టోత్తరం... లేదా లక్ష్మి సహస్రనామం తో లక్ష్మీదేవిని పూజించడం తోపాటు... లక్ష్మీదేవి విగ్రహాన్ని ఒక పళ్ళెంలో పెట్టి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసే  పంచామృతాలలో  బంగారు వస్తువు లేదా ముత్యాలను ఉంచాలి. అభిషేకం అనంతరం  విగ్రహంపై కుంకుమ గంధం వేయాలి. ముందుగా తయారు చేసిన పిండి వంటలు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి... తర్వాత పూలు పండ్లు పంచామృతాలు  పిండివంటలు లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా  పెట్టాలి. పూజ అనంతరం  ఇంటి లోపల ఆవరణలో ఏమిటో దీపాలు తయారుచేసి ఎక్కడకూడా చీకటిగా లేకుండా  దీపాల వెలుగులు విరజిమ్మే లా దీపాలు వెలిగించాలి. పూజకు ముందు దీపాలు వెలిగించ రాదు. ఇలా చేయడం వల్ల ప్రజలకు లక్ష్మీదేవి కటాక్షం లభించి అష్ట  ఐశ్వర్యాలు  కలుగుతాయని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: