అదేంటో  చినబాబు దండయాత్రలు ఎక్కడా  ఆగేట్లు లేదు.  మహమ్మద్ గజనీ చేసినట్లుగా ఆయన కూడా వరసగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారుట. ఇపుడు అర్జంట్ గా టీడీపీలో బాబు తరువాత తాను నంబర్ టు అనిపించుకోవాల్సిన అవసరం లోకెష్ బాబుకు ఉంది. తాజా ఎన్నికల్లో మంగళగిరికి  పోతే మానం, అభిమానం రెండూ పోయేలా జనం తీర్పు ఇచ్చేశారు. ఇపుడు మరో మారు అద్రుష్టం పరీక్షించుకోవడానికి చినబాబు రెడీ అవుతున్నారుట.


దానికి గన్నవరం వేదిక అవుతుందని అపుడే చర్చలు మొదలయ్యాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యె వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తాడని వూహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దాంతో అదే కనుక జరిగితే అక్కడ ఉప ఎన్నిక ఖాయం. ఎందుకంటే జగన్ చెప్పినట్లుగా వైసీపీలో చేరాలనుకుంటే వంశీ తన పదవికి రాజీనామా చేయాలి. ఇక అక్కడ కనుక ఉప ఎన్నిక  నగారా  మోగితే పోటీ అలా ఇలా ఉండదని అంటున్నారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మొత్తానికి మొత్తం మోహరిస్తారు. అదే కనుక జరిగితే ఢీ కొట్టడానికి టీడీపీకి తమ్ముళ్లు సరిపోరు. దాంతో బాబు తరువాత బాబు లోకేష్ బాబు బరిలోకి దిగుతారని అంటున్నారు.


లోకేష్ ని గన్నవరంలో పోటీలో పెట్టించి హిట్ కొట్టాలని టీడీపీ శిబిరం అపుడే ప్లాన్ చేస్తోందట. లోకేష్ కనుక పోటీలో ఉంటే పార్టీ వర్గాలు కూడా గట్టిగా పనిచేస్తాయని. చినబాబుని ఎలాగైనా గెలిపించి అసెంబ్లీ గడప తొక్కించాలని కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని అంటున్నారు. అయితే చినబాబు గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు. మంగళగిరిలో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు గన్నవరం కూడా దెబ్బేస్తే పూర్తిగా పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోతుందన్న  బెంగ కూడా ఉంది. కానీ జగన్ దూకుడుని తట్టుకునేందుకు టీడీపీకి ఎవరూ లేరని అంటున్నారు. అందువల్ల తనయుడి ఫ్యూచర్ ని ఫణంగా పెట్టి అయినా జగన్ని బాబు నిలువరిస్తారట. మరి చూడాలి ఏపీలో ఉప ఎన్నికే జరిగితే ఆ వేడి ఎలా ఉంటుందో. లోకేష్ కి ఎంత సీన్ ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: