పండగ కొందరింట ఆనందాన్ని పంచితే మరికొందరికి విషాదాన్ని మిగుల్చుతుంది. హయిగా జాగింగ్ చేసుకొని వచ్చి కుటుంబ సభ్యులతో దీపావళి చేసుకుందామనుకునే లోపే మృత్యువు కళ్లముంగిట నిలుచుని రా రమ్మని ఆహ్వనం పలికింది. అది రమ్మంటే ఎంతటి వారైన వెళ్లకుండా ఉంటారా. ఏపనిలో గాని ఏ పదవిలో గాని, ఏ ప్రదేశంలో గాని ఉన్నా ఉన్నపళంగా అన్ని సర్దేసుకొని వెళ్లవలసిందే. అలానే వెళ్లారు ఓ నాయకుడు.


అందరు పండగ సంతోషంలో ఉంటే ఆ ఇల్లు మాత్రం దుఖంలో మునిగిపోయింది. ఇంతకు జరిగిన విషయమేంటంటే పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత కమల్‌ శర్మ(48) ఆదివారం ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో దీపావళి పండగ వేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం అలుముకుంది.. ఇకపోతే కమల్‌ శర్మ ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లి వస్తుండగా ఉన్నట్టుండి ఉన్నచోటునే కుప్పకూలిపోయాడు, 


అదే సమయంలో ఆయనతో పాటు ఉన్న సన్నిహితుడొకరు కమల్‌ను చూసి గుండెపోటు వచ్చిందనుకోని వెంటనే స్పందించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కాని ఆ సమయంలో ఏది జరక్కూడదో అదే జరిగింది. దురదృష్టం అతని వెన్నంటే ఉంది అందుకే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శర్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక చివరిసారిగా ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.


ఇకపోతే ఆప్పటివరకు తమకు పండగ శుభాకాంక్షలు చెప్పిన తమనేత అకస్మాత్తుగా మరణించారని తెలుసుకుని ఆయన అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఇక కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా. కమల్ మృతి పార్టీకి తీరనిలోటని రాష్ట్ర బీజేపీ శాఖ సంతాపాన్ని వ్యక్తం చేసింది...


మరింత సమాచారం తెలుసుకోండి: