వల్లభనేని వంశీ టీడీపీ ఎమ్మెల్యే. ఆయన గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు. ఆయన గెలుపు గొప్పగానే చూడాలి. ఎందుకంటే ఈసారి వీచింది జగన్ ప్రభంజనం. దాని నుంచి బయటపడడం అంటే మామూలు విషయం కాదు. వంశీకి జనంలో  ఉన్న పట్టు అది నిరూపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వంశీ గెలిచిన అయిదు నెలలలోనే షాక్ ఇచ్చేశారు. బంగారం లాంటి ఎమ్మెల్యే పదవికి గోవిందా కొట్టేసారు.


అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ ఒక మాట అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు. అది ఎన్నాళ్ళు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. నిజానికి వంశీ జగన్ని కలసి ఏం మాట్లాడారు అన్నది ఎవరికీ తెలియకున్నా ప్రచారంలో ఉన్న దాన్ని బట్టి ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ్య మెంబర్ షిప్ ఇస్తారని, అంటే వంశీ మళ్లీ గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయరన్నమాట. ఈ ఒప్పందంలో భాగంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసి కొంతకాలం  విరామంగా అన్నట్లుగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. మరి ఇపుడు వైసీపీ అనుకున్నట్లుగానే కధ సాగుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ  తరఫున తాజా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట రావు పోటీ చేస్తారు. వంశీ సైడ్ అయనట్లుగా ఉంటారు.


ఆ తరువాత వంశీకి మరో ఆరునెలల్లో పదవి వస్తుంది. ఆయన అపుడు వైసీపీ కండువా కప్పుకుంటారు. ఆ విధంగా గేమ్  ప్లాన్ ఉండబట్టే వంశీ సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. అయితే ఇక్కడ ఇబ్బందులో పడింది మాత్రం టీడీపీయే. ఎందుకంటే ఆ పార్టీకి తప్పనిసరి ఈ  ఉప ఎన్నిక.  అది చూస్తే వంశీ సీటు, ఎవరిని తెచ్చి పెట్టినా గెలుపు అనుమానమే. కానీ తప్పనిసరిగా గెలవాలి. ఎందుకంటే అది టీడీపీ సీటు. మొత్తానికి టీడీపీకి భలే చిక్కు పెట్టేసి వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: