ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు కరువై భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు కూడా భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు ఇసుక కొరత ఎక్కువవుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది భవన నిర్మాణ రంగ కార్మికులు   పనులు లేక కుటుంబాన్ని పోషించలేక మనస్థాపానికి గురై  ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా జరగాయి .

 

 

 

 అయితే ఇప్పుడు తాజాగా మరో భవన  నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . గత 15 రోజుల క్రితం ఈ  ఘటన జరగ్గా...  తాజాగా ఆ వ్యక్తి చనిపోయే ముందు తీసుకున్న  సెల్ఫీ వీడియో బయటకి రావటం తో  అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన వెంకటేష్ అనే భవన నిర్మాణ కార్మికుడు... ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తనకు గల కారణాలు తెలిపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ భవన నిర్మాణ కార్మికులు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో అది అందరినీ కలిచి వేస్తోంది. గుంటూరుకు చెందిన వెంకటేష్ అనే భవన నిర్మాణ కార్మికుడు ... సెల్ఫీ వీడియో లో తన ఆవేదనను తెలియజేశాడు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా తమకు ఎన్నో రోజుల నుండి పనులు లేవని... దీంతో తినడానికి తిండి కూడా కరువైందని తెలిపాడు వెంకటేష్.

 

 

 

 కుటుంబాన్ని కూడా పోషించలేక పోతున్నానని ... పిల్లలను కూడా సరిగా చేసుకోలేక పోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు . నన్ను నమ్మి వచ్చిన భార్యను సంతోష పెట్టలేక పోతున్నానని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పనులు లేక కనీసంకుటుంబ పోషణకు కూడా డబ్బు లేకుండా అయిపోయింది... పనులు  దొరకకపోవడంతో ఆ కోపాన్ని నా  భార్యపై చూపి బాధపడుతున్నాను అంటూ సెల్ఫీ వీడియోలో  ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేష్. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నానని తన చావుకు ఎవరూ కారణం కాదని... ఇసుక కొరత కారణంగా పనులు లేక పోవడం వల్లనే చనిపోతున్నారని వెంకటేష్ సెల్ఫీ  వీడియో లో తెలిపారు. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం అందరినీ కలిచి వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: