ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత చాలా రోజులుగా  పట్టి పీడిస్తున్న సమస్య. ఇసుక కొరతతో ఎంతో మంది భవన నిర్మాణ రంగ కార్మికుల బ్రతుకులు  రోడ్డున పడుతున్నాయి . పనులు లేక కుటుంబాలను పోషించలేక... మనస్థాపానికి గురి అవుతున్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు . ఇసుక  కొరతతో ఒక భవన నిర్మాణ రంగంలోనే కాకుండా భవన నిర్మాణ రంగానికి అనుబంధ రంగాలైన ఇటుక,  సిమెంట్, కాంక్రీట్ వంటి రంగాలు  నష్టాల బాటలో నడుస్తున్నాయి. దీంతో భవన నిర్మాణ రంగానికి అనుబంధంగా రంగాలలో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే ప్రభుత్వం ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినప్పటికీ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 



 రాష్ట్రంలో ఇసుక కొరత రోజురోజుకూ పెరిగిపోతుండంతో... ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కనీస ఉపాధి కూడా దొరకక తిండి లేక పస్తులు ఉంటున్నారు అని.. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్స్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు . అంతేకాకుండా భవన నిర్మాణ రంగం తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేస్తున్నాయి  ప్రతిపక్ష పార్టీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండడం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య పట్టి పీడిస్తున్నదని  ప్రతిపక్షాలు అంటున్నాయి . 



 ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తప్పు పడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇసుక కొరతతో పనులు లేక కుటుంబ పోషణ బరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు  భవన నిర్మాణ రంగ కార్మికులు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించి  భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇదిలా ఉండగా ప్రభుత్వమే అక్రమంగా ఇసుక ను  పొరుగు రాష్ట్రాలకు రవాణా చేయడం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది అని  ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలో ఇసుక కొరత సమస్య తీవ్రంగా  పట్టిపీడిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: