అమెజాన్ , ఫ్లిప్ కార్టులతో ఏపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందాన్ని చేసుకుంది. చేనేత రంగానికి ఊపిరులూదటంలో భాగంగా చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే పై రెండు ఆన్ లైన్ సంస్ధలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అమెజాన్ , ఫ్లిప్ కార్టు ద్వారా అమ్మకాలంటే ఎలాగుంటుందో అందరికీ తెలిసిందే.

 

ప్రస్తుతం చేనేత రంగం చాలా ధీనస్ధితిలో ఉందన్న మాట వాస్తవం.  ముడిసరుకుల ధరలతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా పెద్ద లోపంగా తయారైంది. గడచిన ప్రభుత్వాలు మార్కెటింట్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదన్నది వాస్తవం. 

 

ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో చేనేతలు లక్షలమంది కార్మికులు నెట్టుకొస్తున్నారు. వీరెవరికీ సరైన ప్రోత్సాహం లేనికారణంగా ఉత్పత్తులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాన్ని బట్టే మార్కెటింట్ సౌకర్యాలు అలాగే ఉన్నాయి. అందుకనే జగన్ ఈ విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టారు.

 

పాదయాత్రలోను, మ్యానిఫెస్టోలోను అనేక హామీలిచ్చారు. తన హామీల అమలులో భాగంగా వైఎస్సార్ చేనేత హస్తం పథకం క్రింద ప్రతి కుటుంబానికి  ఏడాదికి రూ. 24 వేల ఆర్ధిక సాయం అందచబోతున్నారు. ఇది చాలాదన్నట్లుగా చేనేత కార్మికులతో నేరుగా అమెజాన్, ఫ్లిప్ కార్ట ఆన్ లైన్ సంస్ధలతో అమ్మకాల ఒప్పందాలు చేసుకున్నారు. పై ఆన్ లైన్ సంస్ధల ద్వారా చేనేత ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకు పంపాలన్నది జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

 

నవంబర్ 1వ తేదీ నుండి అందుబాటులోకి రానున్న ఆన్ లైన్ అమ్మకాల్లో చీరలు, ధోవతులు, డ్రెస్ మెటెరీయల్, చున్నీలు, కుర్తాలు, పల్లాజులు, బెడ్ షీట్లు, దిండు గలీబులు, టవళ్ళు, చేతిరుమాళ్ళను అమ్మకానికి ఉంచబోతున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించటంలో భాగంగా కొత్త కొత్త డిజైన్లు, అధునాతన డిజైన్లతో పాటు మంచి కలర్ కాంబినేషన్లలో ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని జగన్ ఆదేశించారు. మరి జగన్ తాజా నిర్ణయం చేనేతరంగానికి ఏ స్ధాయిలో లాభిస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: