ఒకప్పుడు సమాజంలో గౌరవప్రతిష్టలకు చిహ్నంగా ఇంట్లో ఫోన్‌ సౌకర్యం ఉండటంగా భావించేవారు. ఆ రోజుల్లో టెలిఫోన్ కావాలంటే రాజకీయ పలుకుబడి ఉన్న ఎవరో ఒకరితో సిఫార్సు చేయించుకుని ఇంటికి ఫోన్‌ వచ్చేసరికి ముల్లోకాలు కనిపించేవి.. అలాంటి సమయంలో ఉన్న సంస్ద పేరే  భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌)  ప్రస్తుత పరిస్దితులో ఎవరికి అక్కరలేని సంస్దగా అందరు భావిస్తున్నారు.


ఆ నష్టాల బాటనుండి భయటపడటానికి ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త ప్లాన్స్‌తో ఎప్పటికప్పుడు మనముందుకు వస్తున్న  ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తాజాగా తన యూజర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. అదేమంటే పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి  బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


ఇకపోతే  రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి  ఈ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్‌ మాసంలో రోజుకు 3.5 జీబీ (1.5 జీబీ అదనం) డేటాను అందిస్తోంది. నవంబరు డిసెంబర్‌ మాసాల్లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. అలాగే ఏడాదిపాటు ఉచిత  రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్‌బిటి) లేదా కాలర్ ట్యూన్‌లను కూడా అందిస్తుంది. 


రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్,  రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అంటే అక్టోబర్ 31 లోపు  రీచార్జ్‌ చేసుకున్న కస‍్టమర్లకు 90 రోజుల  అదనపు ప్రయోజనాలు అందుబాటులో వుంటాయన్న మాట.. ఇక మనదేశంలోని టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ తదితర కంపెనీలు నిరంతరం తమ యొక్క టారిఫ్ ప్లాన్ లను మారుస్తూ యూజర్ల ను  విపరీతంగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: