మోడీ కళ్ళు తెరచినా మూసినా పాక్ కి కనిపిస్తున్నారు. భారత్ ఇలా ఐపోయిదేంటి అని పాక్ పదే పదే తలచుకుంటోంది. భారత్ గతంలో మాదిరిగా లేదని కూడా బాధపడుతోంది. ఇక  తన ఆటలు చెల్లవు అని కూడా ఆవేదన చెందుతోంది. కాశ్మీర్ అని ఎంత ఏడ్చినా అది రాదు కదా ఉన్నది కూడా ఊడ్చేందుకు మోడీ తయారైపోతున్నారని కూడా పాక్ భయపడుతోంది. సరే పాక్ ఎంత గగ్గోలు పెట్టినా మోడీ వూరుకోరు కదా, అందుకే సరికొత్త ప్లాన్ తో ఇపుడు పాక్ పీచమణించేందుకు రెడీ అయిపోయారు.


కాశ్మీర్ విషయంలో ప్రపంచానికి పాక్ అబద్దాలు చెబుతోంది. అక్కడ మానవ హక్కులు ఉల్లంఘన‌ జరిగిపోతున్నాయని కూడా గుండెలు బాదుకుంటోంది. ప్రజల‌కు స్వేచ్చ లేకుండా చేస్తున్నారని, జైళ్లలో  ఉంచినట్లుగా ఉంచుతున్నారని కూడా పాక్ బండలు వేస్తోంది. అందుకు గానూ పాక్ కి తగిన గుణపాఠం చెప్పేందుకా అన్నట్లుగా ఇపుడు భారత్ యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం  భారత్ వచ్చింది. ఈ యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం కొన్ని రోజుల పాటు కాశ్మీర్లో పర్యటించనుంది. పాక్ వేషాలు ఇక సాగ‌కుండా, నోరెత్తకుండా చేసేందుకు మోడీ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది, ఈ యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం అనధికార పర్యటనగా జమ్మూకాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలను సందర్శించనుంది.  యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం చేస్తున్న పర్యటన సఫలం కావాలని భారత్ భావిస్తున్నట్లు పేర్కొంది


ఢిల్లీ చేరుకున్న  బృందం ప్రధాని నరేంద్రమోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో భేటీ  అయింది. ఐరోపా పార్లమెంటరీ ప్రతినిధుల రాకను ప్రధాని స్వాగతించారు. భారత్‌లో సంబంధాలను మరింత పెంచుకునేందుకు వాళ్లు చూపిస్తున్న ఆసక్తికి ప్రధాని  హర్షం వ్యక్తం చేశారు.  జమ్మూకాశ్మీర్‌ పర్యటన సందర్బంగా అక్కడి సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యం పట్ల వారికి సరైన అవగాహన కలుగుతుంది అని ప్రధాని అభిప్రాయపడ్డారు.   అక్కడి జరుగుతున్న అభివృద్థి తీరు, పాలనాపరమైన ప్రాధాన్యల పట్ల వారికి స్పష్టమైన అభిప్రాయం కలుగుతుందని పిఎంఒ కూడా మరో వైపు పేర్కొంది. మొత్తం మీద ఐరోపా పార్లమెంటరీ ప్రతినిధుల పర్యటనతో కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలుస్తాయని, అదే సమయంలో పాక్ అబద్దాల నోరు కూడా మూతపడుతుందని మోడీ భారీ స్కెచ్ వేశారు. మొత్తానికి పాక్ పొగరు అణచడంలో ఎప్పటికపుడు ప్రధాని వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు దాయాది దేశానికి నిద్రపట్టనీయడంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: