మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒక రాజకీయ నీతి ఉంది. ఆయన ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మారతారు. అలాగే కొత్త సీటు నుంచి పోటీ చేస్తారు. ఇలా రెండూ కలసి రావడంతో ఆయన ఇరవయ్యేళ్ళ రాజకీయ జీవితం విజయవంతంగా  సాగింది. అయితే 2019 ఎన్నికల సమయంలో మాత్రం అలా జరగలేదు. ఎట్టకేలకు పాత్ర సెంటిమెంట్ ని కొంతైనా కంటిన్యూ చేయాలని భీమిలీ వదిలి విశాఖ నార్త్  సీటు నుంచి పోటీ చేశారు. కానీ సగమే వర్కౌట్ అయింది. గంటా తెలిచారు, టీడీపీ ఓడిపోయింది.


మరి గంటా ఏకంగా పార్టీయే మారిపోవాలనుకున్నారు. ఆయన వైసీపీలోకి దూకాలని కూడా భావించారు. రాజకీయ గాలులను అంచనా వేసి సునామీ ఏ పార్టీ వైపు నుంచి రానుందో చెప్పగలిగే దిట్ట గంటా. మరి ఆయనకు వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రావడం తధ్యమని తెలుసు. అయినా ఆయన వైసీపీలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు. దానికి కారణాన్ని బీజేపీ అధికార  ప్రతినిధి రఘురాం చెప్పుకొచ్చారు.


గంటా పార్టీ  మారకుండా చంద్రబాబు బెదిరించారని అసలు గుట్టు విప్పేశారు. రఘురాం. విశాఖ భూ కుంభకోణాలపై వేసిన సిట్ లో గంటా పేరుందని, దాన్ని చూపించి బాబు బెదిరించడం వల్లనే గంటా టీడీపీ  పార్టీ గోడ దూకి బయటకు రాలేకపోయారని ఆయన అంటున్నారు. అప్పట్లో విశాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఇదే కుంభకోణం విషయమై ఫిర్యాదు చేసిన సంగతిని గుర్తు చేశారు. మొత్తానికి గంటా సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఘనత బాబుదేనని రఘురాం సీక్రెట్ చెప్పేశారు. ఇక ఇపుడు కూడా గంటాతో పాటు ఎవరు తమ పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని అయితే వారు అధికారం కోసం కాకుండా ప్రజాసేవకు తయారై రావాలని సూచించారు. మొత్తానికి గంటా రూట్ ఎటువైపో మాత్రం ఈ బీజేపీ నేత చెప్పడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: