వల్లభనేని రాజీనామాతో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పార్టీకి వలస వెళ్తున్నారు. ఇక ముందు తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం అనే అనిపిస్తుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి రెడీ గా ఉన్నారట. వీళ్లంతా వైస్సార్సీపీ పార్టీకి మారాలని నిర్ణయానికి వచ్చారని వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల నిజమే అని తెలుస్తుంది.

ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడట్లేదు. వారిలో ప్రకాశం జిల్లా కి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ , ఏలూరి సాంబశివరావు మరియు బాల వీరంజనీయ స్వామి వైస్సార్సీపీ అధినేత జగన్ తో మంతనాలకు రాయబరం పంపారట. జగన్ మొన్న ఎన్నికల్లో పుట్టించిన సునామితో అతి కష్టం మీద టీడీపీ నుంచి గెలిచిన 23 ఎమ్మెల్యేలలో చాలా మంది జగన్ చెంతకు చేరాలని చూస్తున్నారట. అయితే జగన్ పెట్టిన నిబంధన ప్రకారం ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన తమ పార్టీ లోకి చేరాలంటే వారి పదవికి రాజీనామా చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇలా పదవికి రాజీనామ చేయడం అనేది వారికి పెద్ద అడ్డంకే అని చెప్పాలి. అయిన సరే రాజీనామా చేసి వైస్సార్సీపీ పార్టీలోకి చేరడానికి సై అంటున్నారు. దీనికి కారణం మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీని హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యారని ఎద్దేవా చేస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కి మనుగడ లేదని వారి వాదన అట. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో చంద్రబాబునాయుడు చేసిన సమ్మె లో పాల్గొనలేదు. ఆ సమ్మె కి చాలా దూరంగానే ఉంటూ వచ్చారు. ఇదంతా ముందు నుంచే వైస్సార్సీపీ పార్టీలో చేరలనే మక్కువతోనే చేశారని మనకి అర్థమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: