1,2,5, 10 రూపాయ‌ల నాణాల కాదు...రూ.125 నాణెం కూడా అందుబాటులోకి వ‌చ్చింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 125 రూపాయల కాయిన్‌ను విడుదల చేశారు. ఓ ప్ర‌త్యేక సంద‌ర్భంగా ఈ నాణం విడుద‌ల చేశారు. ఈ ఏడాది పరమహంస యోగానంద 125 జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ మాట్లాడుతూ.....పరమహంస యోగానంద గారు యోగాకు చేసిన సేవలు అనిర్వచనీయమ‌న్నారు. యోగాతో ఆమె ఎన్నో అద్భుతాలు చేశారు. ఆమె యోగాకు చేసిన సేవలకు చిహ్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. 


పరమహంస యోగానంద గారు 5 జనవరి, 1893లో జన్మించారు. ఆమె ఓ యోగి, మరియు యోగా గురు. క్రియా యోగాను ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె యోగోదా సత్సంగ సొసైటీని ప్రారంభించి చాలా మందికి ఉచితంగా యోగా శిక్షణనిచ్చారు. ఆమె 1952లో మరణించారు. కాగా, ఆమె 125వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ ప్ర‌త్యేక నాణం విడుద‌ల చేస్తున్నారు.
ఇటీవ‌ల ప్రధాని నరేంద్ర మోడీ గాంధీ 150వ జయంతి సందర్భంగా రూ 150 నాణాన్ని విడుదల చేశారు. సచ్ఛభారత్ దివాస్ కార్యక్రమంలో భాగంగా నాణాన్ని విడుదల చేసిన మోడీ సబర్మతి ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడి గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ స్మారక నాణేన్ని విడుదల చేశారు.
ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం నూతన నాణేలను అందుబాటులోకి తెచ్చింది. రూ. 1, 2, 5, 10 నాణేలతోపాటు రూ. 20 నాణేలను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ప్రధాని నరేంద్రమోదీ అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఈ నూతన నాణేలు  దృష్టిలోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించే విధంగా రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: