హైదరాబాద్ మెట్రో సిటీ లో ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టం చేయడం కోసం మరియు నిబంధనలు  పాటించేల చేయడం కోసం   మన పట్టణ ట్రాఫిక్ పోలీస్ యంత్రంగం సరికొత్త ఆలోచనతో ముందుకు వెళుతుంది.  ఇటీవల ఏర్పాటు చేసిన ఏ ఒక్క వాహనదారుడైతే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండ ఒక్క చాలను కూడా నమోదు చేయని వాహనదారులకు ఇప్పుడు సినిమా టికెట్లను ఉచితంగా  ఇవ్వనున్నట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

అలాగే ప్రతినెలా వందమందికి పైగా ఇలాంటి వాహనదారులకు బహుమతులు ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.  అయితే కొందరు మేము ఎలాంటి ఉల్లంఘన చేయలేదని,  ఇప్పటి వరకు ఒక్క చలన  కూడా మా  పైన నమోదు కాలేదని మాకు సినిమా టికెట్ లు ఇవ్వాలని ట్రాఫిక్ అధికారులను అభ్యర్థించారు.  కొందరైతే ఏకంగా ట్రాఫిక్ అదనపు CP (ట్రాఫిక్ ) అనిల్ కుమార్  గారిని సంప్రదించి వారికీ విషయాన్ని తెలియచేసి వారు బహుమతులకు  అర్హులమని  బహుమతులు మరియు సినిమా టికెట్స్ ఇవ్వాలని సూచించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన సీపీ గారు వారికీ ఈ బహుమతులు అందేలా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే వారి నుండి ఈ ప్రయోగం పైన సమాచారం సేకరించి ఇది మంచి ఫలితాన్ని ఇచ్చి ట్రాఫిక్ ఉల్లంఘన సమస్యలను కొంతైనా తగ్గించడానికి  దోహదపడుతుంది  అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణం లో మొదటగా  అవగాహనా పెంచటానికి వివిధ స్థలాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ వారి సిబ్బందికి అర్హులైన వాహనదారులను గుర్తించాలని వారికీ బహుమతులు మరియు సినిమా టికెట్స్ కూడా అందించాలని సూచించారు.

కొందరు అర్హులను సినిమా టికెట్స్ మరియు బహుమతులు అందించి వారికి అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమం వేదికగా వాహనదారులు  కచ్చితంగా హెల్మెంట్ ధరించి వాహనం నడపాలని మరియు మద్యం తాగి,  ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: