సమ్మె అనేది ప్రతి సంస్దలో సర్వసాధరణమే అయినప్పటికి ధీర్ఘకాలిక సమ్మెలవల్ల పేరున్న కంపెనీలే కుదేలులై కూర్చున్న సంఘటనలున్నాయి. ఒక సంస్దను కాపాడు కోవాలంటే ముందుగా పరిస్దితిని చేయి దాటిపోకుండా చూసుకోవాలి. ఒక్క సారి సమస్య మన పరిధి దాటితే అది ఎంతపెద్దగా మారి ఎన్ని అనర్దాలకు దారి తీస్తుందో ఎంతటి ఉపద్రవంలా విరుచుకు పడుతుందో అంచన వేయడం కష్టం. ఎందుకంటే ప్రజాసామ్యం బ్రతకాలంటే దాన్ని నడిపించడానికి సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు తన స్వార్ధం కోసం పాలన చేస్తే ఆ పాలన ఎంతకాలం సాగుతుంది. ఒక్క సారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటే ఎంతటి పెద్ద వ్యవస్దనైన కూల్చే శక్తిగా మారుతారని మన చరిత్రలో ఎన్నో సంఘటనలు నిరూపించాయి.


భయపెట్టి ఎన్నాళ్లు మనుగడ సాగిస్తారు పాలకులు. ఏదో ఒకరోజు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇకపోతే ఇదివరకు ఎన్నోసార్లు ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురై పుట్టగతులు లేకుండా పోయిన ఘటనలు ఉన్నాయి. దీనికి ఉదహరణ  2003 లో జరిగిన సంఘటన.మోటారు వాహన పన్ను రద్దుతో పాటు, ఆర్టీసీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, తదితర డిమాండ్‌లతో  ఈ సమయంలో కార్మికులు సమ్మెకు దిగారు. అప్పట్లో సమ్మె ఉధృతంగా సాగింది. 24 రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.


దీని వల్ల ఓ నీతిని నాయకులు తప్పకుండా నేర్చుకోవాలి. మనవారు అనుకున్నంత వరకు అంతా బాగానే ఉంటుంది ఎప్పుడైతే వారి మధ్య విభేదాలు ఏర్పడుతాయో దాని పరిణామాలు చాప కింద నీరులా వ్యాపించి చివరకు నవ్వులపాలు చేస్తాయి. ఇకపోతే ఇప్పుడు చేస్తున్న సమ్మె కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలలో  అతి పెద్ద సమ్మెగా నిలిచింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితిలో ఇప్పటికే  26 వ రోజుకు చేరుకుంది.


ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన ఈ సమ్మెకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. ఇక ఈ సమ్మెతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రైవేట్‌ సిబ్బంది సహాయంతో పాక్షికంగా బస్సులు నడుపుతునప్పటికీ  ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ సైతం కోట్లాది రూపాయల నష్టాన్ని చవి చూస్తోంది. మరి దీని నుండి గుణపాఠం నేర్చుకో వలసింది ప్రజలా? పాలకులా? ప్రభుత్వమా?...


మరింత సమాచారం తెలుసుకోండి: