బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఒక రోజు పెరిగితే మరో రోజు బంగారం ధర భారీగా తగ్గుతుంది. ఇలా బంగారం ధర ఒకరోజు పెరిగి మరో రోజు తగ్గుతూ ఉండటం వల్ల పసిడి ప్రేమికులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఇప్పుడు బంగారం ధర ఏకంగా 2వేలకు పడిపోయింది. 

                

ఏంటి అని అనుకుంటున్నారా ? అవునండీ.. సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.40,000 మార్క్ పైకి చేరింది. అయితే అప్పటితో బంగారం పోలిస్తే ఇప్పుడు బంగారం ధర దాదాపు రూ. 2,000 కు పడిపోయింది. వెండి ధర కూడా గత నెల 51,000 రూపాయిలు ఉంటె ఇప్పుడు 6 వేలు తగ్గుదలతో రూ.46,155కు చేరింది. 

                

కాగా మరోవైపు  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,488 డాలర్ల సమీపంలో కదులుతుంది. అమెరికా పెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరుకు తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే గత ఆరేళ్ళ సమయంలో బంగారం ధర ఇంత పెరగటం ఇదే మొదటిసారి. 

               

కాగా నేడు బంగారం ధర స్వల్పంగా పైకి కదిలింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.13 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,964కు చేరింది. అలాగే వెండి ధర కూడా 0.36 శాతం పెరుగుదలతో కేజీకి రూ.46,155కు ఎగసింది. అయితే నేడు మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా బంగారం భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: