ఆంధ్రప్రేదశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.  గతంలో అధికార పార్టీ చేసిన తప్పిదాలను ‘ప్రజా సంకల్ప యాత్ర’ తో ప్రజల్లోకి తీసుకు వెళ్లిన జగన్ మోహన్ ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించారు.  ఏపి ప్రజలు పడుతున్న కష్టాలు దగ్గరుండి చూసిన ఆయన వారికి నే విన్నాను..నే ఉన్నాను అన్న భరోసా ఇవ్వడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రజలు ఆయనకు పట్టం కట్టారు.  ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’లో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో  తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాలు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన ఆయన  రెండురోజులు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్విహించిన జగన్ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. అంతే కాదు పలు అభివృద్ది, సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టబోతున్నారు. సీఎం జగన్ చేయబోయే కార్యక్రమాలతో పులివెందుల రూపురేఖలే మారిపోనున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టుగానే పులివెందుల ఓ మోడల్ నియోజకవర్గంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వైఎస్ జగన్ జరిపిన సమీక్షలు తీసుకున్న కీలక నిర్ణయాల విషయానికి వస్తే..పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సిహెచ్‌సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన.  రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం డీపీఆర్‌ సిద్దం చేయాలని ఆదేశించారు. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు, పులివెందుల మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ. 50 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేయాలని చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతేకాదు జేఎన్‌టీయూ కొత్త లెక్చరర్‌ కాంప్లెక్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు,  శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు, సింహాద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లకు రూ. 15 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయింరు.  సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు పులివెందుల వాసులు సంతోషాల్లో మునిగిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: