తెలుగు సినీపరిశ్రమలోనే కాకుండా అన్ని సినీపరిశ్రమల్లోనూ  బాగా సూపరిచితమైన పేరు 'ప్రకాష్ రాజ్'. విలక్షణ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఈయన స్వయంగా రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయ వ్యక్తుల మీద, రాజకీయ పరిస్థితుల మీద తనదైన శైలిలో మాట్లాడి ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. చెప్పాలంటే ఈయనకి వివాదాలు, వ్యక్తిగత విమర్శలు లాంటివి కొత్త కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రస్తావన ఎందుకంటే తాజాగా ఈయన హిందుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదానికి తెరలేపారు. 

సీఎం.యోగి ఆదిత్యనాథ్ మీద ప్రకాష్ రాజ్ కొన్ని విమర్శకర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగే రథోత్సవంకు ముంబై నుంచి కొంతమంది మోడల్స్ తీసుకొచ్చారని. వాళ్ళకి మేకప్ లు వేయించి దేవుడి లాగా వేషాలు వేయిస్తున్నారని, ఘాటుగా స్పదించారు. ఇది ఇలా ఉంటే వారికి సామాన్య ప్రజలే కాక ఐఎఎస్ ఆఫీసర్స్ కూడా వారిని చూసి నమస్కరిస్తున్నారు అంటూ ఎద్దేవాచేశారు. 

అసలు ఇలాంటి పద్దతి దేశానికే మంచిది కాదంటూ ఒక టీవీ షోలో పాల్గొన్నప్పుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. ఇది ఒకటే కాకుండా హిందువులు పండుగలప్పుడు ముస్లిం వారిని బెదిరించే రీతిలో ప్రవర్తిస్తున్నారు అంటూ హిందూ సంఘాలపై ధ్వజమెత్తారు. ఈ విషయం పై ప్రకాష్ రాజ్ పై సోషల్ మీడియా వేదిక గా నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వివాదం అంతా ప్రకాష్ రాజ్ కెరీర్నే సందిగ్ధంలో పడేసేలా ఉంది అంటున్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలన్నీ ఈయన పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

హిందూ దేవుళ్లను కించ పరిచే విధంగా మాట్లాడాడని కన్నడ సినీ పరిశ్రమ వారికి లేఖ రాసి పంపింది. ఇక పై కన్నడ సినిమాల్లో ప్రకాష్ రాజ్ ను తీసుకోకూడదని అన్నారు. కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరించాలని హిందు సంఘాలు ఫిల్మ్ ఛాంబర్ కి ఫిర్యాదు చేసాయి. అలాకాకుండా తనను తిరిగి సినిమాల్లోకి తీసుకుంటే మాత్రం సహించేదిలేదన్నారు. ఇప్పటిని నుంచి ప్రకాష్ రాజ్ చేసే ప్రతి సినిమాని అడ్డుకుంటామని వారు చెప్పారు. ఏ సినిమా కూడా రీలీజ్ కానివ్వం అంటూ హెచ్చరించారు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రకాష్ రాజ్ పై కన్నడ సినీ పరిశ్రమలో వేటు తప్పదని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: