ఎన్నికలకు ముందు ఎలా వచ్చారో...ఎన్నికల తర్వాతా అలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. మామూలుగా అయితే అధికారపార్టీలో నుండి నేతలు బయటకు వెళ్ళటం అరుదనే చెప్పాలి. అలాంటిది ప్రకాశం జిల్లా పర్చూరులో వైసిపి తరపున పోటి చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎందుకు వెళ్ళిపోయారు ? ఎందుకంటే ఆయనొక ఫెయిల్యూర్ లీడర్ కాబట్టే.

 

మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి గాలి ఎంత బలంగా వీచిందో అందరూ చూసిందే. ముక్కు మొహం తెలీని వాళ్ళు కూడా వేలకు వేల ఓట్ల మెజారిటితో గెలిచినపుడు రాష్ట్రవ్యాప్తంగా బాగా పాపులరైన దగ్గుబాటి మాత్రం ఎందుకు ఓడిపోయారు ?  ఇదే జిల్లాలోని గిద్దలూరు ఎంఎల్ఏగా గెలిచిన అన్నె రాంబాబుకు ఏకంగా 80 వేల చిల్లర మెజారిటి వచ్చింది.

 

టిడిపి తరపున గెలిచిన నలుగురు నేతలు తక్కువ మెజారిటితో బయటపడ్డారు. వైసిపి తరపున గెలిచిన వారంతా మంచి మెజారిటిలే తెచ్చుకున్నారు. మరి ఇంతటి గాలిలో కూడా దగ్గుబాటి ఓడిపోవటమే ఆశ్చర్యంగా ఉంది.  దగ్గుబాటి ఓటమికి ప్రధాన కారణం నియోజకవర్గంపై పట్టుకోల్పోవటమే. నేతలు, క్యాడర్ తో  కమ్యూనికేషన్ గ్యాప్ రావటమే. అప్పటి వరకు వైసిపిలో యాక్టివ్ గా ఉన్న రావి రామనాధంబాబును కాదని జగన్ దగ్గుబాటికి టికెట్ ఇచ్చారు. దాంతో రావి వెంటనే టిడిపిలో చేరిపోయారు.

 

ఎప్పుడైతే రావి టిడిపిలో చేరారో ఆయనతో పాటు క్యాడర్ మొత్తం టిడిపిలోకి వెళిపోయింది. అదే రావికే జగన్ టికెట్ ఇచ్చుంటే పర్చూరులో కూడా వైసిపినే గెలిచేదేనేమో.  నిజంగా జగన్ చేసిన తప్పు వల్లే పార్టీ పర్చూరు సీటును కోల్పోయిందనే చెప్పాలి.


అంటే నేతల్లో కానీ క్యాడర్ లో కానీ పట్టులేని కారణంగానే దగ్గుబాటి ఓడిపోయారు. వైసిపి గెలవగానే రావి తిరిగి వైసిపిలోకి వచ్చేయటంతో దగ్గుబాటి పార్టీలో ఇమడలేకపోయారు.  జనబలమున్న రావి ముందు నిలబడలేమని దగ్గుబాటికి అర్ధమైపోయిన తర్వాతే పార్టీలో నుండి సైలెంట్ గా నిష్క్రమించార

 


మరింత సమాచారం తెలుసుకోండి: