ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టప్రకారం ఆరోపణలను ఎదుర్కొంటూ నేరస్తుడిగా పరిగణించబడతారో వారిని చట్టమే శిక్షిస్తుంది అని చెబుతారు. అదే నాయకుడు పవర్ పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే వారి పార్టీ నాయకులపై రాజకీయ కక్షతో లేనిపోని కేసులు పెట్టిందని ఎద్దేవా వేస్తారు. దానికి సరైన ఉదాహరణ మన తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు మాజీ మంత్రి నారా లోకేష్. చంద్రబాబు పరిపాలన లో మంత్రిగా కొనసాగిన నారా లోకేష్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు.

తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల పై పలు ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని లోకేష్ ఇప్పుడు మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులపై అక్రమంగా లేనిపోని కేసులను సృష్టిస్తున్నారని మరియు క్రిమినల్ కార్యకలాపాలను అంటగడుతున్నారని వాపోతున్నాడు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై అతను చేస్తున్న ఆరోపణలు మరీ ఘోరంగా ఉన్నాయి అని పలువురి మాట. 

విషయం ఏమిటంటే గురువారం లోకేష్ ఏలూరు జైలు లో సీనియర్ టిడిపి నేత మరియు మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్ ను కలుసుకున్నాడు. చింతమనేని ప్రభాకర్ పై ఒక రౌడీ నాయకుడు అన్న ముద్ర అనాది కాలంగా ఉంది. అతనిపై ఎన్నో కేసులు ఉండగా అందులో కొన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. అయితే చింతమనేనిని కలిసిన లోకేష్ అతనికి తన పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. 

లోకేష్ చెప్పినది ఏమిటంటే ప్రభాకర్ కు మద్దతుగా తాను మరియు అతని పార్టీ ఎల్లవేళలా నిలబడతామని... వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న ఈ ఈ కక్షపూరిత రాజకీయాలను ఎదుర్కొంటామని అన్నాడు. అలాగే అతను చింతమనేని ఇంటికి కూడా వెళ్లి వారి ఇంటి సభ్యులతో కూడా ఇదే విషయమై మాట్లాడారు. కచ్చితంగా తాను మాజీ ఎమ్మెల్యేను బయటకు తీసుకు వస్తానని శపథం చేసిన లోకేష్ వాదన ఏమిటో అర్థంకాక రాష్ట్ర ప్రజలు దీర్ఘాలోచనలో పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: