కొన్ని కొన్ని సార్లూ మితిమీరిన కామవాంచలు ప్రాణాల మీదికి తెస్తాయనే విషయం చాలా మందికి తెలిసి కూడా అదే దార్లో వెళ్లాలని ప్రయత్నిస్తారు. అలా వెళ్లి చిక్కుల్లో పడతారు. ఇక్కడొక లారీ డ్రైవర్ ఇలాంటి పనికిమాలిన పని చేసి తన అవయవాల్లోని ముఖ్యమైన అవయవాన్ని కోల్పోయాడు. ఇలాంటివాన్ని చూస్తే జాలికలగడం అనే మాట పక్కన పెడితే బుద్ధిహీనులే ఇలా ప్రవర్తిస్తారనిపిస్తుంది. అవసరం తీరేదాక ఒక మాట, అవసరం తీరాక మరో దారిలా ప్రవర్తించిన ఈ విటుడికి ఆ సెక్స్ వర్కర్ తగిన బుద్దే చెప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లితే..


త్రిపురకు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్ ఈ నెల 24వ తేదీన ధర్మనగర్ నుంచి అగర్తాలాకు లోడుతో వెళ్తున్న అర్ధరాత్రి సమయంలో,  హైవే రోడ్డులో, చిమ్మ చీకట్లు ఉన్న ప్రదేశంలో ఓ మహిళ ట్రక్కు ఆపగా, ఈ లారీ డ్రైవర్ వెనకాముందు ఆలోచించకుండా ట్రక్కును ఆపి ఆమెను ఎక్కించుకున్నాడు. అలా ఆ యిద్దరే ఉన్న ఆట్రక్కులో కొంత దూరం వెళ్లాక మాటలు కలిపిన డ్రైవర్ ఆమె మాట్లాడే మాటలతో తాను ఓ సెక్స్ వర్కర్ అని గ్రహించాడు. దీంతో తనలో కోరిక మొదలవ్వగా తన లైంగిక వాంఛ తీర్చాలని, అడిగినంత డబ్బు కూడా ఇస్తానని చెప్పడంతో ఆ మహిళ సరేనంది.


దీంతో  ఆడ్రైవర్ ఆమెతో కోరిక తీర్చుకున్నాక తన దారిన తాను వెళ్లసాగాడు. అతని వాలకాన్ని గమనించిన ఆ మహిళ డబ్బులు అడగగా ఆమెనే దబాయిస్తూ డబ్బులు ఇవ్వనని చెప్పాడు. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఆవేశంగా ట్రక్ క్యాబిన్‌లోకి వెళ్లి అక్కడ  కనిపించిన కత్తి తీసుకుని అతడి పురుషాంగం కోసేసి పరారైంది. దీంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో బాధతో విలవిల్లాడుతూ ఆ చీకట్లో పడిపోయాడు.


కాసేపటి తర్వాత అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ ట్రక్కు డ్రైవర్‌ను గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అస్సాంలోని సిల్చార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ కోసం జల్లెడపడుతున్నారు. ఆమె దోరికితే మాత్రం చేసేదేముంది తప్పు డ్రైవర్ దగ్గర పెట్టుకుని ముందుగా ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని అంటున్నారు ఈ విషయం గురించి తెలిసిన వారు..


మరింత సమాచారం తెలుసుకోండి: